లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ముగింపు
విక్రమ్ సినిమాలో సూర్యను రోలెక్స్ పాత్రలో ప్రవేశపెట్టారు. అలాగే 'కైతి'లోని కార్తీ పాత్ర అయిన డిల్లీని ప్రస్తావిస్తూ విక్రమ్ ముగించాడు
2019లో కార్తీ నటించిన కైతి (ఖైదీ) చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించినప్పుడు అది ప్రణాళికాబద్ధమైన సినిమా విశ్వాని(యూనివర్శ్)కి నాంది పలుకుతుందని ఎవరికీ తెలియదు. అయితే కమల్ హాసన్ 'విక్రమ్'తో దీనిని లోకేష్ అధికారికంగా ప్రకటించాడు. ఇందులో కైతి పాత్రలు ఉన్నాయి. అభిమానులను ఆనందపరిచాయి. వారు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) అని పిలిచేందుకు వెనకాడలేదు. కనగరాజ్ తన చిత్రాల ద్వారా భాగస్వామ్య విశ్వాన్ని సృష్టించిన మొదటి దక్షిణ భారత దర్శకుడిగా గుర్తింపు పొందారు. LCUలో ఇప్పుడు కైతి, విక్రమ్.. దళపతి విజయ్ నటించిన లియో ముఖ్యమైనవి.
విక్రమ్ సినిమాలో సూర్యను రోలెక్స్ పాత్రలో ప్రవేశపెట్టారు. అలాగే 'కైతి'లోని కార్తీ పాత్ర అయిన డిల్లీని ప్రస్తావిస్తూ విక్రమ్ ముగించాడు. దీనికి విరుద్ధంగా కమల్ హాసన్ 'విక్రమ్' నుండి విజయ్ పాత్రకు కాల్ రావడంతో లియోను ముగించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటంలో చేరమని అతడికి పిలుపునిచ్చాడు. ఇది ముగ్గురు కథానాయకులను కలిగి ఉన్న భవిష్యత్ క్రాస్ఓవర్ చిత్రంపై ఊహాగానాలు పెంచింది. అయితే ఇటీవలి కథనాల ప్రకారం. LCU మరింత విస్తరించకపోవచ్చని పరిణామాలు చెబుతున్నాయి. విక్రమ్ 2 చివరి భాగం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
2024 చివరి నాటికి LCUలో నాల్గవ విడత అయిన కైతి 2 షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్న లోకేష్ తరువాతి సంవత్సరం మొదటి సగం ఈ ప్రాజెక్ట్‌కి అంకితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కైతి 2లో కార్తీ పాత్ర దిల్లీ నేపథ్యాన్ని పరిశోధించడం లక్ష్యంగా పెట్టుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. దీని తరువాత విక్రమ్ నుండి సూర్య పాత్ర రోలెక్స్ ఆధారంగా స్పిన్ ఆఫ్ చిత్రాన్ని రూపొందించాలని లోకేష్ భావిస్తున్నాడు. తదనంతరం విక్రమ్ 2 సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం LCU లో పరాకాష్టగా ఉంటుందని సమాచారం. ఇందులో కీలక పాత్రలతో భారీ యాక్షన్ గగుర్పాటుకు గురి చేస్తుందని అంచనా.
లోకేశ్ కనగరాజ్ తన తదుపరి సినిమాలను విశదపరుస్తూ.. సినిమాటిక్ యూనివర్స్ మూలాలను లోతుగా పరిశోధించే 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుగు -తమిళ చిత్ర పరిశ్రమలలో పనిచేసిన నరైన్ ధృవీకరించారు.
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ 'విక్రమ్ 2'తో పరాకాష్టను ఎలివేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. దక్షిణ భారత పరిశ్రమలో అగ్రగామి దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు మార్మోగుతుది. అద్భుతమైన కథల్ని ఎంచుకుని, సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే టెక్నిక్ తో అతడు రికార్డులు తిరగరాస్తాడని అంతా భావిస్తున్నారు.