మరో బిగ్ సీక్వెల్.. లోకేష్ కనగరాజ్ సడన్ సర్ ప్రైజ్

సెకండ్ ఆఫ్ స్టోరీ రొటీన్ గా ఉండటంతో క్రిటిక్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

Update: 2024-06-19 10:54 GMT

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం లియో. గత ఏడాది థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అయితే కథ విషయంలో లోకేష్ కనగరాజ్ పై చాలా విమర్శలు వచ్చాయి. సెకండ్ ఆఫ్ స్టోరీ రొటీన్ గా ఉండటంతో క్రిటిక్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫ్యాన్స్ కూడా కాస్తా అసంతృప్తికి గురయ్యారు.

అయితే సెకండ్ ఆఫ్ లో వచ్చింది అసలు కథ కాదంటూ లోకేష్ కనగరాజ్ తరువాత ట్విస్ట్ ఇచ్చాడు. లియో ఒరిజినల్ స్టోరీ ఏంటనేది పార్ట్ 2లో చూపిస్తానని చెప్పాడు. దీంతో లియో 2 మూవీ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. లియో 2 స్టార్ట్ చేయకుండానే లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో కూలీ మూవీ మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో జరగనున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT మూవీ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత హెచ్ వినోత్ దర్శకత్వంలో విజయ్ మూవీ చేస్తాడనే ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకుడు సెట్ కాలేదు.

అలాగే కార్తీక్ సుబ్బరాజు కూడా విజయ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి దర్శకులలో ఒకరితో విజయ్ తన చివరి సినిమాని చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దళపతి విజయ్ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో GOAT తర్వాత ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తామని చెప్పారు.

అయితే లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లియో 2 మూవీ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని చెప్పాడు. విజయ్ ఛాన్స్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేస్తానని కూడా లోకేష్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. రజినీకాంత్ సినిమాని స్టార్ట్ చేసి సడెన్ గా లియో 2 మూవీ గురించి వ్యాఖ్యలు చేయడంపై సూపర్ స్టార్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. అయితే దళపతి అభిమానులు మాత్రం విజయ్ ని ఒప్పించి స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News