రిలీజ్ కి ముందే స్టార్ డైరెక్టర్ ఒప్పందాల పరంపర!
రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` కి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.
రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` కి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ చిత్రాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా యశ్ రాజ్ ఫిలింస్-రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్నాయి. దసరా సందర్భంగా రెగ్యులర్ షూటింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
2024 అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ తేదీ కూడా ముందే ప్రకటించారు. 2026 మార్చి 20 రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈసినిమా ఏకంగా రెడేళ్ల పాటు సెట్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో రెండు పండుగలు కలిసొస్తున్నాయి. గుడి పడ్వా - ఈద్ వేడుకల సెలవులు రిలీజ్ కి ప్లస్ గా మారుతున్నాయి. ఇక సినిమా పట్టాలెక్కకక ముందే నెట్‌ఫ్లిక్స్‌తో నాన్-థియేట్రికల్ డీల్ ను కూడా బన్సాలీ క్లోజ్ చేసాడు. అలాగే సరేగామాతో రికార్డ్ మ్యూజిక్ డీల్ కూడా పూర్తయింది.
నెట్‌ఫ్లిక్స్ రూ. 130 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇది బేస్ ధర మాత్రమే. రిలీజ్ తర్వాత పెద్ద సక్సెస్ అయితే ఆ నెంబర్ పెరిగే అవకాశం ఉంఉటంది. సరేగామతో మ్యూజిక్ రైట్స్ 35 కోట్లకు దక్కించుకున్నారుట. ఇంకా శాటిలైట్ డీల్ కి సంబంధించి 50 కోట్లకు ఒప్పందం జరుగుతోందిట. మొత్తంగా లవ్ అండ్ వార్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 215 కోట్లకు సమీపంలో ఉంది.
రణబీర్ కపూర్, అలియా భట్ ,విక్కీ కౌశల్ భన్సాలీతో బ్యాకెండ్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రణబీర్ కి థియేట్రికల్ వసూళ్లలో లాభంలో షేర్ ఉంటుంది. ఇందులో రణబీర్ తన భార్య అలియాభట్ తో కలిసి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా బన్సాలీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మకాల పైనా దృష్టి పెట్టినట్లు సమాచారం. సినిమా బడ్జెట్ 200 కోట్ల వరకూ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.