లవ్ మీ.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలి?
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్లు, వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల బిజినెస్ వాల్యూతో థియేటర్స్ లోకి వస్తోంది. అంటే టోటల్ గా 6 కోట్ల షేర్ రావాల్సి ఉంది.
బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య, రౌడీ బాయ్స్ మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ జోడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా లవ్ మీ. దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ సిద్ధమైంది. అరుణ్ భీమవరపు లవ్ మీ మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నేడు లవ్ మీ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. హర్రర్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు.
ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇలాంటి స్టార్ మేకర్స్ వర్క్ చేయడంతో లవ్ మీ చిత్రంపై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. సాంగ్స్ కూడా ఆకట్టుకోవడం విశేషం. దీంతో సినిమాపై కొంత పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 600 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్ లో లవ్ మీ రిలీజ్ అవుతూ ఉండగా చాలావరకు థియేటర్స్ లో దిల్ రాజు సొంతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడ్వాన్స్ బేస్ లో మాట్లాడుకుని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్లు, వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల బిజినెస్ వాల్యూతో థియేటర్స్ లోకి వస్తోంది. అంటే టోటల్ గా 6 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది.
థియేటర్స్ లో కూడా మొదటి రెండు వారాలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. దీంతో థియేటర్స్ దగ్గర పెద్దగా హడావిడి లేవు. ఈ స్పేస్ లవ్ మీ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే సాలిడ్ కలెక్షన్స్ కూడా రాబట్టే ఛాన్స్ ఉంటుంది. బేబీ మూవీ తర్వాత వైష్ణవి చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంతో కూడా లవ్ మీపై కొంత క్రేజ్ ఉంది.
అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ అంటే కచ్చితంగా మంచి కంటెంట్ అయ్యుంటుంది అనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. దిల్ రాజు బ్యానర్ 2 లో బలగం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత లవ్ మీ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆశీష్ కి కూడా ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ కావాలి. ఘోస్ట్ బేస్డ్ కథలు చాలా వచ్చిన కూడా ఈ సినిమా వాటికంటే భిన్నమనే మాటని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చెబుతూనే ఉంది. మరి పబ్లిక్ ని ఏ మేరకు థియేటర్స్ వరకు ఈ చిత్రం రప్పిస్తుందనేది చూడాలి.