బడ్జెట్ తక్కువ.. వసూళ్లు ఎక్కువ!

సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు.. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుంటాయి.

Update: 2024-09-16 17:30 GMT

సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు.. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే.. కంటెంట్ బాగుంటే.. ఇంకేముంది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే. ఇది ఎప్పుడూ జరిగే విషయమే.. పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇప్పుడు సినీ ప్రియులు.. బడ్జెట్.. క్యాస్టింగ్.. సెట్టింగ్స్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. కంటెంట్ ముఖ్యం బిగిలూ అన్నట్లు ఉంటున్నారు.

కంటెంట్ బాగుంటే చాలు.. సినిమాలకు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. చిత్రాలను బ్లాక్ బస్టర్లు హిట్లు చేస్తున్నారు. సౌత్ లోని అన్ని భాషల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. దీంతో బడ్జెట్ తో సంబంధం లేకుండా సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అసలు ఓపెనింగ్స్ అయినా సాలిడ్ గా వస్తాయా.. సినిమా ఆడుతుందా.. అని రిలీజ్ కు ముందు అనుమానాలు క్రియేట్ చేసేవి కూడా ఇప్పుడు థియేటర్లకు మూవీ లవర్స్ ను రప్పిస్తున్నాయి. అద్భుతాలు సృష్టిస్తున్నాయి.

అందుకు ఎగ్జాంపుల్ గా టాలీవుడ్ లో గత రెండు నెలల్లో రిలీజ్ అయిన నాలుగు సినిమాలు నిలిచాయి. క్యాస్టింగ్ చిన్నది.. బడ్జెట్ చిన్నది.. కానీ రిజల్ట్ పెద్దది.. వసూళ్ల సంఖ్య ఇంకా పెద్దది.. అనే విధంగా సత్తా చాటాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన శ్రీసింహ, సత్య మత్తు వదలరా-2.. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఫస్ట్ పార్ట్ కు మించి వసూళ్లు సాధిస్తోంది. ఓ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. వరుస హాలీడేస్ కలిసి రావడంతో లాభాల పంట పండిస్తోంది.

అంతకుముందు, మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన తొలి మూవీ కమిటీ కుర్రోళ్లు కూడా వేరే లెవల్ లో అలరించింది. యదు వంశీ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది. థియేటర్లతో పాటు ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతోంది. మేకర్స్ కు మంచి ప్రాఫిట్స్ అందిస్తోంది. అంజి కె మణిపుత్ర డైరెక్షన్ లో ప్రముఖ గీతా ఆర్ట్స్ 2.. రూపొందించిన ఆయ్ కూడా అనూహ్య విజయం సాధించింది. మేకర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది.

టాలీవుడ్ హల్క్ రానా నిర్మించిన 35- చిన్న కథ కాదు.. మంచి ప్రశంసలు అందుకుంది. వసూళ్లు అనుకున్నంత స్థాయిలో రాకపోయినా.. విమర్శకుల మన్ననలు మాత్రం పొందింది. అయితే ఈ నాలుగు సినిమాలకు గాను నిర్మాతలు భారీ బడ్జెట్లు పెట్టలేదు. స్టార్ క్యాస్టింగ్ ను దింపలేదు. స్టార్ టెక్నీషియన్స్ కు పనులు అప్పగించలేదు. కేవలం కంటెంట్ పై నమ్మకం పెట్టుకున్నారు. చిన్న బడ్జెట్ తో పెద్ద హిట్లు అందుకున్నారు.

Tags:    

Similar News