విశాల్ - లైకా గొడవ.. ఎంతవరకు వచ్చిందంటే..
రీసెంట్గా హీరో విశాల్ మార్క్ ఆంటోని చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను అందుకుంది
రీసెంట్గా హీరో విశాల్ మార్క్ ఆంటోని చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. విశాల్ గత చిత్రాలతో పోల్చితే మంచి రిజల్ట్‌తో పాటు వసూళ్లను అందుకుంది. ఈ క్రమంలోనే విశాల్ కోర్టు కేసును కూడా ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో ఆయన తన ఆస్తులను, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను న్యాయస్థానానికి సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళితే.. విశాల్ సాధారణంగా తన చిత్రాలను తానే నిర్మించుకుంటారు. ఈ క్రమంలోనే విశాల్.. తంలో ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద సుమారు రూ.21.29కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. అయితే ఆయన కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని లైకా సంస్థ చెల్లించింది. అందుకు గానూ విశాల్ నిర్మించే చిత్రాల రైట్స్‌ను తమకి చెందే విధంగా అగ్రీమెంట్ చేసుకుంది.
రీసెంట్గా విశాల్ కథనాయకుడిగా నటించిన, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ మూవీ రైట్స్‌ను లైకాకు కాకుండా వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా ప్రొడక్షన్.. చెన్నై హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆయనపై పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పలు సార్లు చెన్నై హైకోర్టులోని ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. గత నెల 12న ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా.. విశాల్ తన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించారు. కానీ విశాల్ ఆ ఆదేశాలను ఉల్లంఘించారు.
దీంతో ఈ నెల 19న జరిగిన మరో విచారణలో న్యాయస్థానం.. కోర్టు ధిక్కరణ కిందకి పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించగా.. తాజా విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు. ఐడీబీఐ, స్టాండర్డ్ చార్టెడ్, హెచ్‌డీ ఎఫ్‌సీ, యాక్సెస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల వివరాలను న్యాయస్థానానికి అందించారు. కానీ ఇందులో పూర్తి వివరాలు లేకపోవడం వల్ల రిట్ పిటిషన్ దాఖలు చేయల్సిందిగా లైకాను న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, రీసెంట్గా మార్క్ ఆంటోనీతో మంచి విజయాన్ని అందుకున్న హీరో విశాల్ ఇప్పుడు తుప్పరివాలన్ 2లో నటిస్తున్నారు. అలాగే దీంతో పాటే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు.