పొలిమేర లచ్చిమి అపోలో డాక్టర్!
'మా ఊరి పోలిమేర' ప్రాంచైజీ పెద్ద సక్సెస్ అవ్వడంతో అందులో నటీనటులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు
'మా ఊరి పోలిమేర' ప్రాంచైజీ పెద్ద సక్సెస్ అవ్వడంతో అందులో నటీనటులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఎలాంటి అంచానలు లేకుండా ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేర మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రావడంతో పొలిమేర-2ని ఏకంగా థియేటర్లో నే రిలీజ్ చేసి భారీ సక్సెస్ అందుకున్నారు. ఇందులో నటించింది పెద్దస్టార్లు కాదు. కమెడియన్లు..చిన్న చిన్న ఆర్టిస్టులే. కానీ సినిమా సక్సెస్ తో అందరికీ మంచి గుర్తుంపు దక్కుతుంది.
సత్యం రాజేష్ రోల్ తో పాటు ఆయన భార్య పాత్ర పోషించిన కానాక్షి భాస్కర్ ఎక్కువగానే వైరల్ అవుతుంది. ఇందులో అమ్మడు లచ్చిమి పాత్రలో మెప్పించింది. ఆమె పల్లెటూరి ఆహార్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆమె ఆహార్యం...నటన చూసి మీనాక్షి నిజంగానే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయా? అన్న సందేహం కలుగుతుంది. అలా కనిపించడమే నేడు ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
మరి కానాక్షి నిజంగా పల్లెటూరు నుంచి వచ్చిందా? సిటీ నుంచి వచ్చిన అమ్మాయా? అన్నది తెలుసుకుందాం. కామాక్షి భాస్కర్ల చైనాలో మెడిసిన్ చేసింది. అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా కొంతకాలం పనిచేసిందిట. ఆ తరువాతనే మోడలింగ్ పట్ల ఆసక్తి అటువైపు టర్న్ తీసుకుంది. అక్కడా గుర్తింపు రావడంతో సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసి సక్సస్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.
'నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడను . పార్టీలకు .. ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. నాకు బాగా పరిచయమైన వారితోనే చనువుగా ఉంటాను. నలుగురిలోకి చొచ్చుకుపోయే స్వభావం నాలో చిన్ననాటి నుంచి లేదు. ఇప్పటకీ అలవాటు కాలేదు. అందువల్ల నేను ఇండస్ట్రీలో ఇమడలేనని నా ఫ్రెండ్స్ అనేవారు. కానీ అలా ఉంటూనే ఇంతవరకూ వచ్చాను' అని తెలిపింది.