ఇలా పాట‌లు రాయించ‌డం క‌రెక్ట్ కాదు!

పాట‌లు ర‌చించ‌డం లో నేడు ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో ఆరు పాట‌ల‌కు ఆరుగురు వేర్వేరు ర‌చ‌యిత‌లు ప‌నిచేస్తున్నారు

Update: 2024-04-17 06:04 GMT

పాట‌లు ర‌చించ‌డం లో నేడు ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో ఆరు పాట‌ల‌కు ఆరుగురు వేర్వేరు ర‌చ‌యిత‌లు ప‌నిచేస్తున్నారు. ఇంకా అవ‌స‌రం అనుకుంటే ఎంత‌మంది ర‌చయిత‌లైన భాగ‌మ‌య్యే అవ‌కాశంవ ఉంటుంది. ఒక‌ప్పుడు విధానానికి పూర్తి వ్య‌తిరేకం ఇది. అప్పట్లో ఒక సినిమాకి ఒక‌రో ఇద్ద‌రో సాహితి వేత్త‌లు ప‌నిచేసేవారు. ద‌ర్శ‌కుడు క‌థ మొత్తం చెప్పేసి పాట ఇలా ఉండాల‌ని హింట్ ఇచ్చి వ‌దిలేస్తే ఆరుపాట‌లు రెడీ అయ్యేవి. కానీ నేడు ద‌ర్శ‌కులు ఒక్కో పాట‌ని ఒక్కో ర‌చ‌యిత‌తో రాయించి ముందుకెళ్తున్నారు.

తాజాగా ఈ విధానంపై సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మాద‌వ‌పెద్ది సురేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. సినిమాల సంగీతం విషయంలో ఒక్కో తరంలో ఒక్కో గొప్ప కాంబినేషన్ ను చూస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు ఏమైపోయిం దంటే.. ఒక్కో పాటను ఒక్కో రైటర్ తో రాయిస్తున్నారు. కథ మొత్తం ఒక రైటర్ కి చెప్పి అతనితో అన్ని పాటలు రాయించడమే కరెక్ట్. పాత కాలం నుంచి చంద్రబోస్ వరకూ అదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. రైటర్ ను ట్యూన్ లో బంధించి రాయమనడం కూడా కరెక్టు కాదనేది నా ఉద్దేశం.

ఎప్పుడైనా సరే ఎవరిపని వాళ్లు చేస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అందరూ నాతో ఏకీభవించాలని నేను అనుకోవడం లేదు. నిర్మాతలు మొత్తంగా మాట్లాడేసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు. అందువల్లనే ఇలా జరుగుతోంది. ఏమైనా అంటే ట్రెండ్ అంటున్నారు .. అది ఒట్టిమాట అనేది నా ఉద్దేశం. ఇప్పటికీ మనం పాత సినిమాలు చూస్తున్నాం .. పాత పాటలు వింటున్నాం ఎందుకనేది అర్థం చేసుకుంటే చాలు` అని అన్నారు.

మాధవపెద్ది సురేష్ `బృందావనం` .. `భైరవద్వీపం` .. `శ్రీకృష్ణార్జున విజయం` వంటి సినిమాలతో సంగీతంలో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. పాత‌త‌రం సంగీత ద‌ర్శ‌కుల్లో ఆయ‌న‌కు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. కొత్త త‌రం సంగీత ద‌ర్శ‌కులు అందుబాటులో కి రావ‌డంతో అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు.

Tags:    

Similar News