స్టార్ ప్రొడ్యూసర్ కూతురు..స్టార్ డైరెక్టర్ వైఫ్ మరీ ఇలానా?
నిర్మాతలుగా స్టార్ ప్రొడ్యూసర్ల, హీరోల కుమార్తెల నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫ్ వరకు అంతా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
పేరున్న ఫ్యామిలీ నుంచి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్లుగా వారసులు ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. చాలా వరకు ఇప్పటికే కొంత మంది హీరోలుగా, మరి కొంత మంది నిర్మాతలగా సెటిలయ్యారు. మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్మాణ రంగంలో మరి కొంత మంది ఎంట్రీ ఇచ్చేసి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంత మంది నిర్మాతల కూతుళ్లు నిర్మాతలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య కూడా నిర్మాతగా సూర్యదేవర నాగవంశీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ రేసులో దిల్ రాజు కుమార్తె హన్షిత నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే 'బలగం'తో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా అంతర్జాతీయంగా వందకు పైగా అవార్డుల్ని దక్కించుకుని ఈ ఏడాది ఇండియా తరుపున ఆస్కార్ వేళ్లేందుకు రెడీ అవుతోంది. దత్తు కూతుళ్లు ఇప్పటికే నిర్మాతలుగా బ్లాక్ బస్టర్లని దక్కించుని సక్సెస్ అయ్యారు. ఇక మిగిలింది చిరు కూతురు సుస్మిత. తను ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తోంది. సరైనా సినిమా పడితే తను కూడా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయం.
నిర్మాతలుగా స్టార్ ప్రొడ్యూసర్ల, హీరోల కుమార్తెల నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫ్ వరకు అంతా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే భారీ సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న చినబాబు (హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ) కుమార్తె హారిక, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య తాజాగా ఓ సినిమా తీశారు. అదే 'మ్యాడ్'. నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 31 గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. యూత్ సినిమా తీయాలనే యావలో పచ్చి బూతు సినిమాని నిర్మించడంతో అంతా టీజర్ చూసి అవాక్కవుతున్నారు.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సందేశాత్మక కుటుంబ కథా చిత్రాలని నిర్మించి ఇండస్ట్రీలో మంచి పేరున్న చినబాబు కూతురు హారిక సూర్యదేవర, త్రివిక్రమ్ వైఫ్ సాయి సౌజన్య..ఈ ఇద్దరు లేడీస్ కలిసి 'మ్యాడ్' అంటూ పచ్చి బూతు సినిమా తీశారని టీజర్ చూసిన వాళ్లు తలంటేస్తున్నారట. మంచి సినిమా తీయకపోయినా తప్పులేదు కానీ ఆడవాళ్లు నిర్మాతలుగా ఇలాంటి సినిమాని నిర్మించడం ఏంటని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్. సితార ఎంటర్ టైన్మెంట్స్.., హారిక అండ్ హాసిని సంస్థల్లో వచ్చే ప్రతి సినిమా వెనకాల గురూజీ హస్తం తప్పకుండా ఉంటుంది. తెలిసి తెలిసి ఇద్దరు ఆడవాళ్లతో త్రివిక్రమ్ ఇలాంటి బూతు సినిమా ఎలా తీయించాడని అంతా వాపోతున్నారట.