చైనా బాక్సాఫీస్ ని ర‌ప్ఫాడించేస్తోన్న రాజా!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌హారాజా` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-06 18:30 GMT

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌హారాజా` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ్ తో పాటు తెలుగులోనూ పెద్ద విజ‌యం సాధించింది. తండ్రి-కూతురు సెంటిమెంట్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ ని నితిల‌న్ స్వామినాధ‌న్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసింది. థియేట్రికల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 109 కోట్లను రాబ‌ట్టింది. అటుపై ఓటీటీలోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అక్క‌డా అద్భుత‌మైన విజ‌యాన్ని అందించింది. విజయ్ సేతుప‌తి ల్యాండ్ మార్క్ 50వ చిత్రంగా రిలీజ్ అయిన `మ‌హారాజా` ఆ ర‌కంగా సంచ‌ల‌న‌మైంది. ఈసినిమాని ఇట‌వ‌లే చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. 40 వేల స్క్రీన్ల‌లో చిత్రాన్ని రిలీజ్ చేసారు. చైనీస్-డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్ 29న విడుదల చేశారు. అక్క‌డ కూడా సునామీ కొన‌సాగిస్తుంది. ఈ సినిమా ఇప్ప‌టికే అక్క‌డ బాక్సాపీస్ వ‌ద్ద 40 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించించిన‌ట్లు తెలుస్తోంది. ఇది నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న బాక్సాఫీస్ లెక్క‌.

సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో ఇదే దూకుడు ఇంకా కొన‌సాగిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రపంచవ్యాప్తంగా 149 కోట్లు వసూలు చేసింది. దీంతో `ఇండియ‌న్ -2` వ‌సూళ్ల‌ను బీట్ చేయ‌డానికి ఇంకా రెండు కోట్ల దూరంలోనే ఉంది. `ఇండియ‌న్ -2` వ‌ర‌ల్డ్ వైడ్ 151 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాకు అయిన ఖ‌ర్చు 200 కోట్లుపైనే. కానీ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో 150 బాక్సాఫీస్ వ‌ద్ద క్లోజ్ అయింది. కానీ మ‌హారాజా మాత్రం త‌క్కువ బ‌డ్జెట్ లో నిర్మించి వ‌ర‌ల్డ్ ని షేక్ చేస్తున్నారు.

దీంతో 150 కోట్ల క్ల‌బ్ స‌హా టాప్ -5 చిత్రాల్లో మ‌హారాజా నిలిచిన‌ట్లు అవుతుంది. ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన 5 కోలీవుడ్ సినిమాలు ఇలా ఉన్నాయి. మొదటి 4 స్థానాలను దాదాపు 460 కోట్లతో విజయ్ ` ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్`, 339 కోట్లతో `అమరన్`, 256 కోట్లతో `వెట్టైయన్` , 155 కోట్లతో `రాయన్` ఆక్రమించాయి. త‌ర్వాత స్థానంలో మ‌హారాజా చేరే అవ‌కాశం ఉంది. చైనాలో పలు రికార్డులను బద్దలు కొట్టేందుకు రానున్న వారంలో మహారాజాకు మంచి అవకాశం ఉంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది.

Tags:    

Similar News