మహేష్ క్యారెక్టర్ తో మళ్ళీ ఆ అవతారం
అయితే ఒక సీన్ మహేష్ బాబు రాముడి అవతారం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.
దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కానీ ఇంకా సెట్స్ పైకి రాకముందు నుంచే అనేక రకాల కథనాలు అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి. అసలు ఆ కథ ఎలా ఉంటుంది మహేష్ బాబు ఎలా కనిపిస్తాడు అనే అంశాలు ఆడియన్స్ లో అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేస్తూ ఉన్నాయి. కథ రచయిత విజయేంద్రప్రసాద్ ఇదివరకే ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్ గా వారణాసి బ్యాక్ గ్రౌండ్ లోనే అసలు కథ మొదలవుతుంది అన్నట్లుగా మరొక లీక్ అయితే ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది. ఇక రాజమౌళి విజన్ కు తగ్గట్టుగానే మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేనంతగా గడ్డం పెంచేస్తున్నాడు. ఒక వరల్డ్ ట్రావెలర్ గా అతను కనిపించబోతున్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చేశారు. రీసెంట్ గా రాజమౌళి ఆఫ్రికా అడవులను చుట్టేయడంతో గతంలో ఎప్పుడూ లేనంత భారీ లొకేషన్స్ ను సినిమాలో చూపించబోతున్నట్లుగా అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది. శ్రీరాముడి అవతారం తరహాలో మహేష్ బాబు ఒక స్పెషల్ ఎపిసోడ్లో దర్శనం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ RRR తరహా లోనే ఉంటుందట. RRR సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ లో హఠాత్తుగా శ్రీరాముడి తరహాలో కనిపించిన విధానం ఆడియన్స్ కు ఎంతగానో కిక్కిచ్చింది.
ముఖ్యంగా నార్త్ లో సినిమా సక్సెస్ కావడానికి ఈ ఎపిసోడ్ కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అయితే ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమాలో కూడా అలాంటి ప్లాన్ ఒకటి డిజైన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో గుప్త నిధుల వేటతోపాటు ఎన్నో అంతుచిక్కని రహస్యాలను సినిమాలో చూపిస్తారట. ఇక దానికి హిందూ దేవాలయాలకు సంబంధించిన అంశాలు కూడా లింక్ చేస్తూ కథపై హైప్ క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఒక సీన్ మహేష్ బాబు రాముడి అవతారం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ రాజమౌళి అయితే ఇప్పటివరకు ఏ విషయంపై సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
అసలైతే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ ఏడాది చివరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలి. కానీ పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమయ్యే వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకూడదని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.