మహేష్-సితార స్టైల్.. న్యూయార్క్ షేకైందిగా
ఇలాంటి సమయంలో మన దర్శకనిర్మాతల ఆలోచనలు, ప్రయత్నాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి.
భారతదేశంలో సూపర్ మేన్‌ల ప్రవేశం ఒక కీలక మలుపు. `హనుమాన్` తో ప్రశాంత్ వర్మ, `కల్కి 2989 ఏడి`తో నాగ్ అశ్విన్ తెలుగు సూపర్‌మేన్ లను ఘనంగా లాంచ్ చేసారు. ఈ సినిమాల సీక్వెళ్లలోను సూపర్ మేన్ లు రెట్టించిన ఎనర్జీతో దూసుకు వస్తారు. మునుముందు అవెంజర్స్, బ్యాట్ మేన్, సూపర్ మేన్, వండర్ ఉమెన్, ఆక్వామేన్ లాంటి సూపర్ డూపర్ ఫ్రాంఛైజీల తరహాలో భారతీయ సినిమా సూపర్ హీరోయిక్ గా ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఇలాంటి సమయంలో మన దర్శకనిర్మాతల ఆలోచనలు, ప్రయత్నాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. రాజమౌళి-శంకర్- ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్, సుకుమార్ .. ఇంకా నేటితరం ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ కొత్తదనం నిండిన స్క్రిప్టులతో రాబోతున్నారు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచే శక్తి వారికి ఉంది. అయితే ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ రాజమౌళితో పాన్ ఇండియా (పాన్ వరల్డ్) సినిమా చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
అంతేకాదు.. మహేష్ కుటుంబం నుంచి నటవారసులు గౌతమ్ కృష్ణ- సితార ఘట్టమనేని కూడా వేగంగా ఎదిగేస్తూ అభిమానుల ఆలోచనల్లో మెదులుతున్నారు. గౌతమ్ కృష్ణ త్వరలోనే కథానాయకుడిగా లాంచ్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు. అదే సమయంలో సితార ఆరంగేట్రంపైనా అంచనాలున్నాయి. సితార చాలా చిన్న వయసులోనే యూట్యూబ్ స్టార్ గా అందరినీ అలరించింది. ఇప్పుడు వడి వడిగా ఎదిగేస్తోంది. తండ్రికి తగ్గ తనయగా నటనారంగంలోకి ప్రవేశిస్తుందని ఇంతకుముందే అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.
అందుకే సితార నటించే సినిమా ఏదైనా మన దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తే బావుంటుంది కదా? సూపర్ స్టార్ మహేష్ - సితార డ్యూయోకి సెట్టయ్యే మాంచి సూపర్ హీరో స్టోరీని నేరేట్ చేసేవాళ్లే లేరా? అంటూ ఒక ప్రశ్న ఎదురైంది. ఇదిగో దానికి స్ఫూర్తి ఈ ఫోటోగ్రాఫ్. సితారతో కలిసి మహేష్ న్యూయార్క్ వీధుల్లో ఇలా స్టైలిష్ గా ఫోజ్ ఇచ్చారు. తండ్రి కూతుళ్ల ఫోజ్ క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయపోయింది. రాజమౌళి మూవీ కోసం మహేష్ పొడవాటి గిరజాల జుత్తు పెంచారు. గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఫిజికల్ గా అతడి ట్రాన్స్ ఫర్మేషన్ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు తండ్రి కూతుళ్లను చూడగానే ఆ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాలని అభిమానులు ఆశపడుతున్నారు. బాలీవుడ్ లో షారూఖ్ - సుహానా కలిసి నటిస్తున్నారు. అలాంటి ఒక ప్రయత్నం మహేష్ - సితార చేస్తే బావుంటుంది అనేది అభిప్రాయం. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. కాస్త వేచి చూద్దాం.