మహేష్..బన్నీకి అటెళ్లే ఆలోచనే లేదా?
ఆ సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే చిరంజీవి తర్వాతి తరం హీరోల్లో బాలీవుడ్ లో ఇంత వేగంగా లాచ్ అయింది చరణ్ ఒక్కడే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిపిందే. తెలుగులో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సమయంలోనే 'జంజీర్' రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఆ సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే చిరంజీవి తర్వాతి తరం హీరోల్లో బాలీవుడ్ లో ఇంత వేగంగా లాచ్ అయింది చరణ్ ఒక్కడే. అటుపై డార్లింగ్ గా ఫేమస్ అయిన ప్రభాస్ 'బాహుబలి'తో పాన్ ఇండియాని షేక్ చేసిన వెంటనే? 'సాహో'తో హిందీ మార్కెట్ ని నిలబెట్టుకున్నాడు.
ఇదే నమ్మకంతో 'ఆదిపురుష్' తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఫలితం సంగతి పక్కనబెడితే రాముడి పాత్రలో ప్రభాస్ మెప్పించిన వైనం విమర్శ కుల ప్రశంసలు కురిపించింది. అలాంటి పాత్రలకు ఇండియాలో తాను తప్ప ఇంకెవ్వరూ సెట్ కారని నిరూపించాడు. వీళ్లిద్దరి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇటీవలే షురూ చేసిన సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిన తారక్ ఇదే సరైన సమయంగా భావించి 'వార్ -2' తో లాంచ్ అవుతున్నాడు.
ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఈసినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో? చెప్పాల్సి న పనిలేదు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలంతా హిందీ లో అధికారికంగా లాంచ్ అయ్యారు. మరి వీళ్లందరి కంటే సీనియర్ అయిన సూపర్ స్టార్ మహేష్ లాంచ్ అయ్యేది ఎప్పుడు? ఐకాన్ స్టార్ గా ఫేమస్ అయిన అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చేది ఇంకెప్పుడు? అన్న సందేహం ఇప్పుడు అభిమానుల్లో వాడి వేడి చర్చకు తెర తీస్తుంది.
మహేష్ వాళ్లందరికంటే సీనియర్ హీరో. బాల నటుడిగానే తెరంగేట్రం చూసి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగులో తాను ఇప్పుడు కొత్తగా చేయాల్సిందంటూ ఏమీ లేదు. అంత పేరున్న హీరో ఇంతవరకూ హిందీ లోకి వెళ్లలేదు. ప్రస్తుతం రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నప్పటికీ అది తెలుగు నుంచి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా మాత్రమే. నార్త్ మార్కెట్ లో అది డెబ్యూ తప్ప స్ట్రెయిట్ హిందీ సినిమా కాదు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' తో పాన్ ఇండియాలో లాంచ్ అయ్యాడు. హిందీ మార్కెట్ లోనూ సత్తా చాటాడు. కానీ అతను కూడా ఇంతవరకూ అక్కడ లాంచ్ అయింది లేదు. అలాంటి ఆలోచన కూడా కనబడలేదు. మరి వీళ్లిద్దరి ప్లాన్ ఏంటి? అంటే? టాలీవుడ్ నుంచే ఇద్దరు హిందీలోనూ మార్కెట్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రయోగాలు ఎందకు చేయకూడదు అన్న దృక్ఫధం కనిపిస్తుంది.