మహేష్ కలెక్షన్ మతిపోగొడుతోందే!
సూపర్ స్టార్ మహేష్ సింప్లిసిటీ గురించి త్రివిక్రమ్ ఎంతో గొప్పగా చెబుతారు.
సూపర్ స్టార్ మహేష్ సింప్లిసిటీ గురించి త్రివిక్రమ్ ఎంతో గొప్పగా చెబుతారు. మహేష్ షూటింగ్ సెట్స్ కి రావాలంటే రేంజ్ రోవర్ అవసరం లేదు. ఆడీలు..బంజ్ లు...రోల్స్ రాయల్స్ లాంటి ఖరీదైన కార్లు అంతకన్నా అక్కర్లేదు. చిన్న కారు ఉన్నా అందులో సర్దుకుని వచ్చేసే స్వభావం గలవారని చెప్పిన ఓ సందర్భంగా ఇప్పటికీ వైరల్ అవు తుంటుంది. అంత పెద్ద సూపర్ స్టార్ అయినా...కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే హీరో అయినా మహేష్ ఇంత నిరాడంబరంగా ఉంటారా? అన్నది సంగతి అప్పుడే అర్దమైంది.
అలాగని ఖరీదైన లగ్జరీ కార్లలో తిరగరని కాదు. బయటకు వెళ్లాంటే రేంజ్ ని హైలైట్ చేయాల్సిన పనిలేదని... ఎలాగైనా ఉండొచ్చు అని అర్దం. కానీ మహేష్ కార్ల కలెక్షన్ చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. ఆయన కలెక్షన్ చూస్తే కార్లు అంటే ఇంత పిచ్చా? అనిపిస్తుంది. మహేష్ వద్ద ఉన్న రేంజ్ రోవర్ వోగ్ కారు 3.0-లీటర్ V6 డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 240 Bhp శక్తిని, భారీ 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.3.38 కోట్లు. ఆడి ఇ-ట్రాన్.. మహేష్ వద్ద రూ. 1.19 కోట్ల విలువైన ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు ఉంది.
ఎలక్ట్రిక్ SUV హై-స్పీడ్ ఛార్జింగ్, ఆల్-వీల్ డ్రైవ్‌ను కలిగి ఉంది. ఇది 71kWh బ్యాటరీతో వస్తుంది. గరిష్టంగా 308 hp, 540 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ.. మహేష్ గ్యారేజీలో ఉన్న ఈ కారు ధర రూ. 2.18 కోట్లు. ఇది రేంజ్ రోవర్ కారు మొదటి లగ్జరీ రైడ్. బీఎండబ్ల్యూ 730Ld.. రూ. 1.30 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఈ లగ్జరీ కారు. మోడల్ 7 సిరీస్ లైనప్‌లోని డీజిల్ వేరియంట్. వినూత్నమైన ఫీచర్స్, ప్రత్యేకమైన డ్రైవింగ్ డైనమిక్స్ కలిగి ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఇ.. మహేష్ వద్ద ఉన్న ఈ మోడల్ కారు E సిరీస్ 5 వేరియంట్‌లలో వస్తుంది. ఈ కారు ధర రూ. రూ. 66.99 లక్షల నుండి రూ. 84.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 281 బిహెచ్‌పి పవర్, 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మహేష్ కార్ల సేకరణలో లగ్జరీ కారు లంబోర్ఘిని గల్లార్డో కూడా ఉంది. కేవలం రెండు సీట్లు కలిగి ఉన్న ఈ కారు రూ.2.80 కోట్లు ఉంటుంది. ఈ కారు గరిష్టంగా 550బిహెచ్‌పి పవర్, 540ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెర్సిడెస్ జీఎల్ క్లాస్.. మహేష్ బాబు గ్యారేజీలో పార్క్ చేసిన మరో మెర్సిడెస్ తెల్లటి మెర్సిడెస్ జీఎల్ క్లాస్ SUV. టయోటా ల్యాండ్ క్రూయిజర్ V8.. రూ.1.5 కోట్ల విలువైన ఈ కారులో 7 సీట్లు ఉన్నాయి.
4461 సీసీ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ కారు గరిష్టంగా 262 bhp & 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా మొత్తంగా మహేష్ వద్ద కూడా భారీగానే కార్ల కలెక్షన్ ఉందని తెలుస్తోంది. కార్లు అంటే సూపర్ స్టార్ కృష్ణకి కూడా ఎంతో ఆసక్తి. అప్పట్లో ఆయన వద్ద మంచి బ్రాండెడ్ కార్లు ఉండేవని ఆయన తరం నటులు చెబుతుంటారు. అదే ఆసక్తి మహేష్ లోనూ ఉందని తెలుస్తోంది.