కింగ్ నుంచి కింగ్ సైజు వినోదం! మ‌హేష్‌

మరి ఈ ట్వీట్ పై షారుక్ ఎలాంటి రిప్లై ఇస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. షారుక్-మ‌హేష్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-09-08 09:57 GMT

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ న‌టించిన 'జ‌వాన్' బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలిరోజే వ‌ర‌ల్డ్ వైడ్ 150 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డు సృష్టించింది. షారుక్ న‌ట‌న‌..అట్లీ మేకింగ్ తో ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసారు. దీంతో అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్. అన్ని ప‌రిశ్ర‌మ‌లు ఈ జోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

'జవాన్'.. బ్లాక్ బస్టర్ సినిమా.. కింగ్ నుంచి కింగ్ సైజు వినోదం. షారూక్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రం.. ప్రకాశం, తేజస్సు, స్క్రీన్ పై కనిపించిన తీరు ఎంతో ప్రత్యేకం. జవాన్ షారూక్ సొంత రికార్డులనే బ్రేక్ చేస్తుంది.

ఎంతో కూల్.. దిగ్గజాల నుంచి స్టఫ్' అంటూ మహేశ్ బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. మరి ఈ ట్వీట్ పై షారుక్ ఎలాంటి రిప్లై ఇస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. షారుక్-మ‌హేష్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే.

సినిమా రిలీజ్ కి ముందు మ‌హేష్ కూడా సినిమా చూడ‌టానికి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూ స్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిగా షారుక్ మీరు ఎప్పుడు చూస్తారో చెప్పండి..మీతో పాటు నేను కూడా కూర్చుని చూస్తానన్నారు. మ‌హేష్ తో క‌లిసి ప‌నిచేయ‌డానికి కూడా సిద్దంగా ఉన్న‌ట్లు మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట పెట్టారు షారుక్. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని మ‌రోసారి రుజువైంది.

మ‌హేష్ న‌టించిన ఓ సినిమా సెట్ ని గ‌తంలో షారుక్ విజిట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి షారుక్ కోరిక మేర‌కు ఆ ద్వ‌యం ఎప్పుడు చేతులు క‌లుపుతుందో చూడాలి. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ చూసి బాలీవుడ్ హీరోలంతా తెలుగు సినిమావైపు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News