పుష్ప 2.. సుక్కు ఇచ్చే షాక్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-09-20 05:12 GMT

సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ తన మాస్ యూపోరియాతో మరోసారి బాక్సాఫీస్ పై విధ్వంసానికి రెడీ అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది . పుష్ప 2 సినిమా అసలైతే ఆగష్టు లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అది కుదరలేదు. డిసెంబర్ 6 రిలీజ్ టార్గెట్ తో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది.

ఈమధ్యనే పుష్ప 2 రిలీజ్ పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నవంబర్ ఎండింగ్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేలా ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ తప్పనిసరి అన్నారు. ఐతే లేటెస్ట్ గా పుష్ప 2 షూటింగ్ ఇంకా టైం పడుతుందన్న మాట వినిపిస్తుంది. తను అనుకున్న ప్రొడక్ట్ రావాలంటే సుకుమార్ తగిన టైం ఇవ్వాలి. అందుకే పుష్ప 2 ని చాలా ఫోకస్ గా ఒక శిల్పాన్ని చెక్కినట్టుగా చేస్తున్నాడు సుకుమార్.

మిగతా వాళ్లు, ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే తనకు కావాల్సిన టైం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో పుష్ప 2 కి ఆయన అడిగిన డేట్స్ ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ఐతే డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేలా ప్లాన్లు వేస్తున్నారట. ఐతే ఒకవేళ పుష్ప 2 రిలీజ్ మళ్లీ వాయిదా పడితే ఆ డేట్ ని వదలకుండా మైత్రి మూవీ మేకర్స్ తమ బ్యానర్ లో వస్తున్న నితిన్ రాబిన్ హుడ్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

నితిన్ వెంకీ కుడుముల ఈ కాంబోలో ఆల్రెడీ భీష్మ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ కాంబో రిపీట్ చేస్తూ రాబిన్ హుడ్ వస్తుంది. ఈ సినిమా మీద కూడా మైత్రి మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 రిలీజ్ కష్టమే అని డిసైడ్ అయితే చిన్నగా ఈ సినిమాను డిసెంబర్ 6కి తెచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారట. అసలైతే ఫస్ట్ క్రిస్ మస్ రేసులో రాబిన్ హుడ్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఐతే ఆ టైం లో రాం చరణ్ గేం చేంజర్ వస్తుండటం వల్ల పోటీకి రాలేని పరిస్థితి అని తెలుస్తుంది.

Tags:    

Similar News