మిల‌న్ ఫ్యాష‌న్ వీక్‌లో క‌ళ్ల‌న్నీ త‌మ‌న్నాపైనే!

త‌మన్నా భాటియా ఏం చేసినా అది యూనిక్ గా ఉంటుంది. ఇటీవ‌ల ప్ర‌త్యేక గీతాల్లోను త‌న‌దైన ముద్ర వేస్తూ అందరినీ ఆక‌ట్టుకుంటోంది.

Update: 2024-09-20 05:42 GMT

త‌మన్నా భాటియా ఏం చేసినా అది యూనిక్ గా ఉంటుంది. ఇటీవ‌ల ప్ర‌త్యేక గీతాల్లోను త‌న‌దైన ముద్ర వేస్తూ అందరినీ ఆక‌ట్టుకుంటోంది. రెండు ద‌శాబ్ధాల కెరీర్ ర‌న్ సాగించినా కానీ త‌మ‌న్నా క్రేజ్ ఇప్ప‌టికీ త‌గ్గ‌లేద‌ని నిరూప‌ణ అవుతోంది. కేవ‌లం సినిమాల‌తోనే కాదు త‌న‌దైన ఫ్యాష‌న్ సెన్స్ తోను ఈ భామ ట్రెండ్ సెట్ట‌ర్ గా మారుతోంది.

ప్ర‌తిసారీ ఫ్యాష‌న్ ప్రియుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచే కొత్త వేష‌ధార‌ణ‌ల‌తో మిల్కీ క‌నిపిస్తోంది. ప్రత్యేకమైన రూపాన్ని ఎలివేట్ చేసేందుకు సరిహద్దులను చెరిపేసే ఫ్యాషన్ మార్గదర్శకురాలిగా త‌న‌దైన‌ ముద్ర వేస్తోంది. సినిమా ప్రమోషన్లు లేదా సాధారణ విమానాశ్రయ దుస్తుల వరకు ఆధునిక శైలితో క్లాస్‌ని ఎలా మిళితం చేయాలో త‌మ‌న్నాకు బాగా తెలుసు. ఇటీవలి మిలన్ ఫ్యాషన్ వీక్ `SS25 ప్రదర్శన` షో స్టాప‌ర్ గా నిలిచింది. బోల్డ్ లుక్ లో మాబ్ వైఫ్ లుక్ తో మిల్కీ మతులు చెడ‌గొట్టింది. ప్ర‌ఖ్యాత `లీపాక్షి ఎల్లవాడి రాబర్టో కావల్లి` సెల్ఫ్స్ నుండి ప్ర‌త్యేకంగా రూపొందించిన డిజైన‌ర్ దుస్తులలో తమన్నా అద్భుతంగా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంది. బ్రౌన్ అండ్ వైట్ ఫాక్స్ లెదర్ ప్యాంట్ ధరించి కాంబినేష‌న్ డిజైన‌ర్ టాప్‌తో స్పెష‌ల్ గా కనిపించింది. ఈ దుస్తుల‌కు విలాస‌వంత‌మైన ఊల్ ఓవర్‌కోట్ ని జోడించింది. ఇటీవ‌లి కాలంలో ఈ బ్యూటీ యూనిక్ లుక్ ల‌లో ఇది ఒక‌టి.

తమన్నా భాటియా నిరంత‌రం ఫ్యాషన్ ప్రపంచంలో ఫేవరెట్‌గా మారుతోంది. ఇదివ‌ర‌కూ మిలన్ 2024 ప్రదర్శనకు ముందు మరొక అద్భుతమైన లుక్‌తో ప్రజలను ఆశ్చర్యపరిచింది. కాక్‌టెయిల్ గ్లామ్ డిజైన‌ర్ దుస్తులతో క‌నిపించి ఈవెంట్లో అహూతులు నోరెళ్ల‌బెట్టేలా చేసింది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన స్పెష‌ల్ డ్రెస్ గురించి ఫ్యాష‌న్ ప్రియుల్లో బోలెడంత చ‌ర్చ సాగింది.

తమన్నా భాటియా ఫ్యాషన్ ఎంపికలు ఎల్లప్పుడూ అభిమానులకు, స్టైల్ ప్రేమికులకు స్ఫూర్తినిస్తాయి. తాను కనిపించిన ప్రతిసారీ తన రేంజ్ ను మంచి అభిరుచిని హైలైట్ చేస్తూ డిజైన‌ర్ పాఠం చెబుతుంది. తమన్నా ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డ త‌న ఫ్యాష‌న్ సెన్స్ నిరంత‌రం ప‌రీశీల‌నకు వ‌స్తోంది. యువ‌త‌రం దానిని ఫాలో అవుతున్నారు.

కెరీర్ సంగ‌తి చూస్తే.. ఇటీవ‌లే స్త్రీ 2లో స్పెష‌ల్ నంబ‌ర్ తో అల‌రించింది. జైల‌ర్ నుంచి `కావాలా..` పాట త‌ర్వాత త‌మ‌న్నా కెరీర్ లో మ‌రో అద్బుత‌మైన క్రెడిట్ ఇది. అలాగే తమన్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన `ఓదెలా 2` విడుదలకు సిద్ధమవుతోంది. మ‌రిన్ని ప్రాజెక్టులు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Tags:    

Similar News