సమంత కొత్త ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఏడాది గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు, సిరీస్ లు కమిట్ అవుతోంది.

Update: 2024-09-20 05:59 GMT

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఏడాది గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు, సిరీస్ లు కమిట్ అవుతోంది. పాన్ ఇండియా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబర్చుతున్న సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు ఈమె చేస్తున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉండేలా తన తదుపరి సినిమాలు, సిరీస్ లను ఎంపిక చేస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతోంది. త్వరలో ఈ అమ్మడు సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


సమంత ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ఈ ఏడాది నవంబర్‌ 7న అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ లో సమంత చేసిన యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, ఆమె పాత్ర సాధారణ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఒక వైపు సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతూ ఉంటే మరో వైపు సమంత నెట్‌ ఫ్లిక్స్ కోసం 'రక్త్‌ బ్రహ్మంద్‌' అనే వెబ్‌ సిరీస్ ను కమిట్‌ అయింది. ఆ వెబ్‌ సిరీస్ షూటింగ్ లో సమంత జాయిన్‌ అయింది. ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

తుంబద్ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో సమంత నటిస్తున్న 'రక్త్‌ బ్రహ్మంద్‌' వెబ్‌ సిరీస్ లో సమంత తో పాటు వామికా గబ్బి కీలక పాత్ర లో కనిపించబోతుంది. ఇప్పటికే వామిక గబ్బి షూటింగ్‌ లో పాల్గొంటూ ఉండగా, ప్రస్తుతం సమంత షూటింగ్ కు జాయిన్ అయింది. ఈ వెబ్‌ సిరీస్‌ ను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్ ను మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా చిత్రీకరించబోతున్నారు. ఈ వెబ్‌ సిరీస్ ను రాజ్ అండ్‌ డీకే లు నిర్మిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ లో సమంత పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

గత సంవత్సరం శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో ఒక్క సినిమా కూడా ఆమె నటించిన సినిమా వచ్చే పరిస్థితి లేదు. కానీ వెబ్‌ సిరీస్ తో ఈ ఏడాది చివర్లో నవంబర్‌ లో సిటాడెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత వచ్చే ఏడాది రెండు సినిమాలు ఒక వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సమంత సినిమాలు, సిరీస్ లు ఉండే విధంగా స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నారు. టాలీవుడ్ లో సమంత సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News