సూపర్ స్టార్ మహేష్ మరో మల్టీప్లెక్స్
ఏషియన్ సినిమా వారితో కలిసి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మహేష్ బాబు వచ్చారు. ఏఎంబి మాల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది
సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి మీడియం రేంజ్ కథలని సిల్వర్ స్క్రీన్ పై ఇతర హీరోలతో నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే థియేటర్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే గడ్చిబౌలీలో ఏఎంబి మాల్ నడుస్తోంది. హైదరాబాద్ లో హైయెస్ట్ టికెట్ ధరలు ఉండేది ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ లోనే.
ఏషియన్ సినిమా వారితో కలిసి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మహేష్ బాబు వచ్చారు. ఏఎంబి మాల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. దీంతో హైదరాబాద్ లో మరో థియేటర్ ని తీసుకొని కంప్లీట్ మల్టీప్లెక్స్ లో సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. హైదరాబాద్ లో సుదర్శన్ 70 ఎంఎం అంటే తెలియని వారు ఉంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా సక్సెస్ వేడుకలు జరుపుకున్నాయి. ఈ థియేటర్ చాలా చరిత్ర ఉంది. అయితే సుందర్శన్ 70 ఎంఎం థియేటర్ ని నడపలేక క్లోజ్ చేసేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు దానిని తీసుకొని ఏషియన్ వారితో మల్టీప్లెక్స్ లో అభివృద్ధి చేశారు. మహేష్ బాబుకి ఇది రెండో మల్టీప్లెక్స్. ఏఎంబి క్లాసిక్, సుదర్శన్ 70 ఎంఎం పేరుతో ఈ మల్టీప్లెక్స్ లో ప్రారంభించబోతున్నారు.
ఏఎంబి క్లాసిక్ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉంటాయంట. గతంలో సుదర్శన్ లో సింగిల్ స్క్రీన్ లోనే మూవీని చూసేవారు. ఇప్పుడు ఏకంగా 7 స్క్రీన్స్ పై విడనాథాన్ని ఆశ్వాదించవచ్చు. త్వరలో దీనిని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఏషియన్ సినిమాస్ జాయిన్ వెంచర్స్ గా హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ చైన్స్ ని బిల్డ్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారి పార్ట్నర్ షిప్ కొనసాగుతూ ఉండగా మాస్ మహారాజ్ రవితేజ కూడా మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి వచ్చి ఏషియన్ వారితో కలిసి స్టార్ట్ చేశాడు. అలాగే విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అల్లు అర్జున్ కూడా సత్యం థియేటర్ ని మల్టీప్లెక్స్ గా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.