మహేష్ బాబు మినహాయింపు కాదు సుమీ!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏదైనా సినిమాని ప్రారంభించే ముందు ప్రీప్రొడక్షన్ సహా నటీనటుల ప్రీప్రాక్టీస్ కోసం చాలా సమయం వెచ్చిస్తారు
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏదైనా సినిమాని ప్రారంభించే ముందు ప్రీప్రొడక్షన్ సహా నటీనటుల ప్రీప్రాక్టీస్ కోసం చాలా సమయం వెచ్చిస్తారు. కఠిన ఆంక్షల నడుమ స్టార్లు తమ డేట్లను లాక్ చేసి సుదీర్ఘ కాలం పని చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభాస్ - రానా బృందం బాహుబలి - బాహుబలి 2 కోసం ఐదేళ్ల పాటు లాక్ అయ్యారు. సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే శారీరక పరివర్తన సహా నటన పరంగా చాలా ప్రీప్రాక్టీస్ చేసారు. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ కోసం రామ్ చరణ్ - ఎన్టీఆర్ కఠోరంగా శ్రమించారు. రెండేన్నరేళ్లు పైగానే ఆర్.ఆర్.ఆర్ కోసం షేపవుట్ అవ్వకుండా నిరంతరం కసరత్తులు చేస్తూ ఫిజికల్ ఫిట్ నెస్ ని మెయింటెయిన్ చేసారు వీరంతా. అందుకే ఆన్ ది స్క్రీన్ లుక్ పరంగా కూడా చరణ్ , ఎన్టీఆర్ మార్కులు కొట్టేసారు.
ఇప్పుడు ఇదే తరహా శిక్షణ మహేష్ బాబుకు కూడా ఉండబోతోంది. రాజమౌళితో పని చేయాలనుకున్న ఏ హీరోకి అయినా మినహాయింపు అన్నది లేదు. మహేష్ కి కఠోర శిక్షణ తప్పనిసరి. SSMB29 కోసం అతడు ఒక రూపాన్ని పొందడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. నెలల తరబడి సాగే భారీ వర్క్‌షాప్‌లు, రిహార్సల్స్‌లో మహేష్ బాబు సహా చిత్రబృందం పాల్గొంటారు. స్టార్డమ్తో సంబంధం లేకుండా ఏ హీరో అయినా రాజమౌళి సినిమా కోసం రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. మహేష్ బాబు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దానికి తగ్గట్టే జక్కన్న సూచనలు పాటిస్తూ మహేష్ తన రూపాన్ని అమాంతం మార్చేయబోతున్నారు. చాలా స్టైలిష్ గాను అతడు మారబోతున్నాడు. ఇప్పటికే విదేశీ లొకేషన్లలో వాతావరణాన్ని అలవాటు పడేందుకు మహేష్ తన ఫిట్నెస్ కోచ్ తో పాటు ప్రిపరేషన్ సాగించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా మహేష్ లుక్ పూర్తిగా ఒక హాలీవుడ్ స్టార్ కి ఏమాత్రం తగ్గకూడదనేది రాజమౌళి ఆలోచన అని తెలిసింది. దానికోసం మహేష్ ఎంతో క్రమశిక్షణతో కసరత్తులు చేస్తారు. రూపాన్ని పూర్తిగా మార్చేస్తారు.
రాజమౌళి స్టైల్ అడ్వెంచర్ ఫిల్మ్‌తో మహేష్ బాబు ప్రేక్షకులకు షాక్ లివ్వడం ఖాయమన్న చర్చా సాగుతోంది. మహేష్ ఇప్పటికే జిమ్ లో కసరత్తులు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేయగా, అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంగతి తెలిసిందే.