మహేష్ గారు నా పేరును కూని చేయకన్నారు: తేజ సజ్జా
యువరాజు సినిమాలో మహేష్ కొడుకుగా నటించిన తేజా ఈ రోజు తన హనుమాన్ మూవీతో మహేష్ గుంటూరుకారంతో పోటీ పడుతున్నారు.
చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఈ రోజు హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి రెడీ అవుతోన్న యువ హీరో తేజా సజ్జా. బాల నటుడిగా చాలా మంది స్టార్స్ తో తేజా నటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు. యువరాజు చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. యువరాజు సినిమాలో మహేష్ కొడుకుగా నటించిన తేజా ఈ రోజు తన హనుమాన్ మూవీతో మహేష్ గుంటూరుకారంతో పోటీ పడుతున్నారు.
ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసులో జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తేజా తన హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తేజా సజ్జా మహేష్ బాబుతో జరిగిన తన చైల్డ్ హుడ్ అనుభవాలు పంచుకున్నారు.
యువరాజు సినిమా చేసే సమయంలో నేను మహేష్ గారిని మగేష్ అన్న అని పిలిచేవాడిని అని అయితే ఆయన పిలిచి నా పేరుని కూని చేయకు, అన్న అని పిలువు చాలు అని అన్నారని ఆ సంఘటన తనకి ఇంకా గుర్తుందని చెప్పుకొచ్చాడు. అలాగే చిన్న పిల్లలతో యాక్టింగ్ చేయించడం చాలా కష్టం అని, ప్రస్తుతం హీరోగా చేస్తూ చైల్డ్ యాక్టర్ గా చేసిన అనుభవంతో చెబుతున్నానని తేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే దర్శకుడు చౌదరి, మహేష్ బాబు చాలా ఓపికగా నా నుంచి బెస్ట్ వచ్చేంత వరకు చేపించేవారని తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి తేజా సజ్జా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంతో పాటు పరోక్షంగా మహేష్ బాబు పేరుని పదే పదే ప్రస్తావించడంతో గుంటూరు కారం సినిమాకి కూడా ప్రమోషన్ చేస్తున్నట్లు అవుతోందనే మాట వినిపిస్తోంది.
ఇక హనుమాన్ కి గుంటూరు కారం కారణంగా ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకలేదు. అయితే నార్త్ ఇండియాలో హనుమాన్ భారీస్క్రీన్ లో రిలీజ్ అవుతోంది. అక్కడే ప్రశాంత్ వర్మ హోప్స్ కూడా పెట్టుకున్నాడు. సినిమాపైన కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ వాటికి తగ్గట్లు మూవీకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో వేచి చూడాలి.