మహేష్ `పాన్ వరల్డ్ అవతార్`
సూపర్‌స్టార్ మహేష్ బాబు వయసు ఫ్యాన్స్ లో డైలమా క్రియేట్ చేస్తుంది. ఆయన వయసు ఐదు పదులకు చేరువలో ఉంది
సూపర్‌స్టార్ మహేష్ బాబు వయసు ఫ్యాన్స్ లో డైలమా క్రియేట్ చేస్తుంది. ఆయన వయసు ఐదు పదులకు చేరువలో ఉంది అంటే ఎవరూ నమ్మరు. 1975 ఆగస్టులో ఆయన జన్మించారు. ఇప్పటికి ఏజ్ 48. మరో రెండేళ్లలో హాఫ్ సెంచరీ కొట్టేస్తాడు. కానీ ఇటీవలి కాలంలో అతడి మేకోవర్ చూస్తుంటే ఆశ్చర్యపోని వారు ఉండరు. అతడు గౌతమ్ కృష్ణకు సోదరుడు అంటే ఎవరైనా నమ్మేస్తారు. అంతగా టీనేజర్ లుక్ తో మెరిసిపోతున్నారు మహేష్.
సూపర్ స్టార్ తాజా ఫోటోగ్రాఫ్ ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో మహేష్ కాలేజ్ బోయ్ ని తలపిస్తున్నాడు. మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ అవతార్ మతులు చెడగొడుతోంది. అతడు మరీ ఇంత షార్ప్ లుక్ లోకి మారిపోవడం చూస్తుంటే ఇది కచ్ఛితంగా తన తదుపరి చిత్రం కోసమేనని అభిమానులు భావిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటించనున్న మహేష్ తన దర్శకుడి సూచన మేరకు మేకోవర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిమ్ యోగా సెషన్స్ సహా పర్ఫెక్ట్ ఆహార నియమాలు పాటిస్తూ లుక్ పరంగా ఛేంజ్ చూపిస్తున్నారు. మహేష్ స్టైలిష్ గా రేబాన్ ధరించి, వైట్ కోట్ తో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నారు.
మహేష్ బాబు నటించిన `గుంటూరు కారం` ఈ శుక్రవారం థియేటర్లలోకి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్య క్రిషన్, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ డ్రామాకు ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకి ఉన్న భారీ హైప్ దృష్ట్యా విడుదలకు ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రం ప్రీ-సేల్స్‌లో రూ. 19 కోట్లు ఆర్జించింది. భారతదేశంలో 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడవ్వడం ఒక రికార్డ్. మహేష్ చిత్రం USలో ఎప్పటిలానే మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే విదేశాలలో ప్రీబుకింగులు టికెట్ సేల్స్ రూపంలో 1 మిలియన్ డాలర్లను సంపాదించింది. ప్రీబుకింగుల పరంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6.25 కోట్లు .. తెలంగాణలో రూ. 8.99 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఓపెనింగ్ డే చక్కని ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈ సంక్రాంతి బరిలో హనుమ్యాన్, సైంధవ్, నా సామి రంగ చిత్రాలతో గుంటూరు కారం పోటీపడుతోంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ తో మహేష్ మూడో సినిమా ఇది.