మ‌హేష్..రాజ‌మౌళి మౌనం వెనుక కార‌ణం!

ఇక రాజ‌మౌళి ఏకంగా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగని ..వ‌ర్మ లా ఓ బ్రాండ్ ఐడెంటిటీని సంపాదించాడ‌ని...మేకింగ్ ప‌రంగా త‌న‌కో ప్ర‌త్యేక‌త ఉంద‌ని ట్రైలర్ చూసి స్పందించారు.

Update: 2023-12-04 16:30 GMT

'యానిమ‌ల్' ని మ‌హేష్ ...రాజ‌మౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా ఏ రేంజ్ లో ఎత్తేసారో తెలిసిందే. ఇంత‌వ‌ర‌కూ మ‌హేష్ ఏ సినిమా ట్రైల‌ర్ గురించి కూడా మెంట‌ల్ వ‌చ్చేసింద‌ని స్పందిచ‌లేదు. త‌న సినిమా విష‌యంలో కూడా ఏనాడు ఇంత ఎగ్జైట్ మెంట్ కి గురైంది కూడా లేదు. సినిమా చూడ‌టానికి ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని ప‌బ్లిక్ గానే చెప్పారు. ఇక రాజ‌మౌళి ఏకంగా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగని ..వ‌ర్మ లా ఓ బ్రాండ్ ఐడెంటిటీని సంపాదించాడ‌ని...మేకింగ్ ప‌రంగా త‌న‌కో ప్ర‌త్యేక‌త ఉంద‌ని ట్రైలర్ చూసి స్పందించారు.

జ‌క్క‌న్న సైతం సినిమా చూడ‌టానికి ఆస‌క్తిగా ఉన్నాన‌ని వ్యాఖ్యానించారు. మ‌రి ఇంత ఎగ్జైట్ మెంట్ కి గురైన ఆ ఇద్ద‌రు రిలీజ్ త‌ర్వాత ఎందుకు మౌనం వ‌హిస్తున్న‌ట్లు. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులు గ‌డుస్తుంది. కానీ ఇంత‌వ‌ర‌కూ మ‌హేష్‌..రాజ‌మౌళి మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి పీడ్ బ్యాక్ ఇవ్వ‌క పోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. వాళ్లిద్ద‌రు ఖాళీ లేక చూడ‌లేక‌పోతున్నారా? లేక ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియ‌దు గానీ..వాళ్లిద్దరు అభిప్రాయాలు చెప్ప‌క‌పోవ‌డం మాత్రం జ‌నాల్లోకి నెగిటివ్ గా వెళ్తుంది.

ప్ర‌స్తుతం మ‌హేష్ `గుంటూరు కారం` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స‌మ‌యం లేక చూడ‌లేక‌పోతున్నారు? అన్న ఓ కార‌ణం తెర‌పైకి వ‌స్తుంది. ఇక రాజ‌మౌళి అయితే ఖాళీగానే ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ సినిమా ప‌నుల్లో ఉన్నా! మ‌రి ఊపిరాడ‌నంత బిజీషెడ్యూల్ అయితే ఉండ‌దు క‌దా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆయ‌న విదేశాల‌కు వెళ్లింది కూడా లేదు.

హైద‌రాబాద్ లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌క్క‌న్న ఇంకా ఎందుకు సినిమా చూడ‌లేదు? ఏ కార‌ణం చేత త‌న రివ్యూ ఇవ్వ‌డం లేద‌ని ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. యానిమ‌ల్ హిట్ టాక్ దూసుకు పోతుంది. వంద‌ల కోట్ల వ‌సూళ్ల సునామీ కొన‌సాగిస్తుంది. కంటెంట్ కాస్త కృషీయల్ గా అనిపించినా అంతిమంగా బాక్సాఫీస్ లెక్క అన్న‌ది ఫైన‌ల్ కాబ‌ట్టి...విమ‌ర్శించ‌డానికి ఛాన్సు లేదు. ఎందుకంటే సినిమాని సినిమాగానే చూడాలి త‌ప్ప‌! అందులో వంక‌లు పెట్ట‌డానికి లేద‌ని మేక‌ర్స్ స‌హా న‌టులు న‌మ్ముతారు.

Tags:    

Similar News