రెండ‌వ వివాహం చేసుకున్న 'ర‌యీస్' బ్యూటీ

తాజాగా ఈ బ్యూటీ రెండ‌వ వివాహం చేసుకున్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స‌లీమ్ క‌రీమ్ అనే పాకిస్తానీ వ్యాపార వేత్త‌ను అమ్మ‌డు ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Update: 2023-10-03 06:22 GMT

'ర‌యీస్' చిత్రంతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన పాకిస్తాన్ న‌టి మ‌హీరాఖాన్ సుప‌రిచితమే. అమ్మ‌డు తొలి సినిమాతోనే ఇక్క‌డ భారీ విజ‌యాన్ని అందుకుంది. ఆ స‌క్సెస్ త‌ర్వాత చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. కోట్ల రూపాయ‌ల పారితోషికాలు ఆఫ‌ర్ చేసారు. కానీ అమ్మ‌డు స్వ‌దేశానికి ఇచ్చిన ప్రాధాన్య‌త శ‌త్రుదేశా నికివ్వ‌లేదు. పాకిస్తానీలోనే సినిమాలు చేస్తాను? త‌ప్ప భార‌తీయ చిత్రాలు చేయ‌న‌ని ఒట్టు పెట్టుకుంది.

అప్ప‌టి నుంచి పాకిస్తానీ చిత్రాల‌తోనే అల‌రిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెండ‌వ వివాహం చేసుకున్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స‌లీమ్ క‌రీమ్ అనే పాకిస్తానీ వ్యాపార వేత్త‌ను అమ్మ‌డు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలంగా ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారు. వివాహ బంధంతో ఒక‌టి కావాల‌ని నిశ్చ‌యించు కున్నారు. విష‌యం ఇరుకుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేసి పెద్ద‌ల స‌మక్షంలో ఒక‌ట‌య్యారు.

పెళ్లి దుస్తుల్లో జంట ఎంతో అందంగా క‌నిపిస్తుంది. మ‌హీరా ముస్తాబైన విధానం వావ్ అనిపిస్తుంది. ఇక వి వాహ వేడుకలో తనవైపు నడుచుకుంటూ వస్తున్న మహీరాను చూసి సలీమ్ భావోద్వేగానికి గురయ్యాడు. మ‌హీరాతో ప్రేమ బంధాన్ని పెళ్లిగా మారుతోన్న స‌మ‌యంలో ఆనంద‌బాష్పాలు రాల్చాడు. ఆమెను హత్తుకుని ..ముద్దు పెట్టి కంటతడి పెట్టాడు. ఇక మ‌హీరాఖాన్ కిది రెండ‌వ వివాహం.

ఇంత‌కు ముందే ఆమెకి వివాహ‌మైంది. భ‌ర్త‌తో విబేధాలు రావ‌డంతో విడిపోయింది. అప్ప‌టి నుంచి కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉంది. ఈ నేప‌థ్యంలో సలీమ్ తో స్నేహం ఏర్ప‌డింది. అటుపై అది ప్రేమ‌..పెళ్లి వ‌ర‌కూ దారి తీసింది. ప్ర‌స్తుతం మ‌హీరాఖాన్ సినిమాల‌కంటే ఎక్కువ‌గా టీవీషోలు చేస్తోంది. గ‌తేడాది వ‌రుస‌గామూడు నాలుగు సినిమా చేసింది. ఆ త‌ర్వాత వెండి తెర‌కు దూర‌మైన‌ట్లు క‌నిపిస్తుంది. 2022 త‌ర్వాత అమ్మ‌డు ఎలాంటి సినిమాకి సంత‌కం చేసిన‌ట్లు లేదు. అలాగే వెబ్ సిరీస్ చేసింది. కానీ అక్క‌డా అంత యాక్టివ్ గా క‌నిపించ‌లేదు.

Tags:    

Similar News