వీడియో: 1/2 ని.లో యువ‌హీరో 34 ఎక్స్‌ప్రెష‌న్స్

ఇందులో ఇషాన్ ఖట్టర్ అద్భుతమైన నృత్య‌ ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ డ్యాన్స్ కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. దీనిని ఒకే అన్ క‌ట్ టేక్‌లో చిత్రీకరించారు.

Update: 2023-12-19 09:58 GMT
వీడియో: 1/2 ని.లో యువ‌హీరో 34 ఎక్స్‌ప్రెష‌న్స్
  • whatsapp icon

అవును.. కేవ‌లం అర‌నిమిషం వీడియోలో యువ‌హీరో 34 ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చి ఔరా! అనిపించాడు. ఇంత‌కీ ఎవ‌రీ ప్ర‌తిభావంతుడు? అంటే ధ‌డ‌క్ ఫేం ఇషాన్ ఖ‌త్త‌ర్. అత‌డు ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల్లో న‌టించేశాడు. ఆరంగేట్ర‌మే ధ‌డ‌క్ లో వీర‌ప్రేమికుడిగా క‌నిపించిన ఇషాన్ ఆ త‌ర్వాత ఖ‌లీపిలీలో కొంత ముదురు తెలివితేట‌లున్న కుర్రాడి పాత్ర‌లో అద్బుతంగా న‌టించి మెప్పించాడు. స్టార్ హీరో షాహిద్ క‌పూర్ సోద‌రుడిగా సినీరంగ ప్ర‌వేశం చేసినా కానీ త‌న‌దైన న‌ట‌ప్ర‌తిభ‌, డ్యాన్సింగ్ సామ‌ర్థ్యంతో మెరిపిస్తున్నాడు బుల్లోడు.

ప్ర‌స్తుతం ఇషాన్ 'పిప్పా' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌. తాజాగా పిప్పా నుంచి ఉత్కంఠభరితమైన నృత్య కళాత్మక ప్రదర్శనతో కూడుకున్న 'మెయిన్ పర్వానా' పాట గ్లిమ్స్ ఇన్ స్టాలో విడుద‌లైంది. ఇందులో ఇషాన్ ఖట్టర్ అద్భుతమైన నృత్య‌ ప్రదర్శన హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ డ్యాన్స్ కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. దీనిని ఒకే అన్ క‌ట్ టేక్‌లో చిత్రీకరించారు.

ఇషాన్ మంత్రముగ్ధులను చేసే కదలికలకు అత‌డి అరుదైన ఎక్స్ ప్రెష‌న్స్ అద‌న‌పు బ‌లంగా మారాయి. ఇషాన్ కి న‌ట‌న ఎక్స్ ప్రెష‌న్స్ వార‌స‌త్వంగా వ‌చ్చిన‌వి. అత‌డి తల్లి నెలిమా అజీమ్, సోదరుడు షాహిద్ కపూర్ నుండి ప్రేర‌ణ పొందిన ప్ర‌తిభావంతుడిగా మారాడు. డ్యాన్స్ విష‌యంలో అతడి అంకితభావం - నైపుణ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా బాలీవుడ్ డ్యాన్స్ మాస్ట్రో హృతిక్ రోషన్ దృష్టిని కూడా ప‌లుమార్లు ఆకర్షించాయి.

ఇంత‌కుముందు ఇదే పాట మేకింగ్ వీడియోని రిలీజ్ చేయ‌గా, అందులో ఇషాన్ డ్యాన్సింగ్ నైపుణ్యాలపై హృతిక్ ప్రశంసలు కురిపించాడు. విజయ్ గంగూలీ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాట ఖట్టర్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిల‌వ‌నుంది. యువ‌హీరో నృత్యంలో నిబద్ధత నైపుణ్యాన్ని పరిపూర్ణంగా ఆవిష్క‌రించిన పాట ఇది. లెజెండరీ A. R. రెహమాన్ ఈ పాట‌ను స్వరపరిచారు. అరిజిత్ సింగ్, పూజా తివారీ, నిసా శెట్టి , రక్షిత సురేష్ స్వరాలు అందించారు. డ్యాన్సుల్లో ఇషాన్ ఖట్టర్ తన అసాధారణమైన చురుకుదనం క‌చ్చితత్వాన్ని ప్రదర్శిస్తూ బెస్ట్ డ్యాన్స‌ర్ల లీగ్ లో చేరాడు. యువ‌హీరో నృత్య ప్రదర్శన కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. యువ‌హీరో అర‌నిమిషంలో 34 ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చాడు అంటూ నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

పిప్పా క‌థాంశం ఆస‌క్తిక‌రం. భారతదేశపు 45 అశ్వికదళ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ బలరామ్ సింగ్ మెహతా జీవిత క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. చరిత్రాత్మక వారియ‌ర్ సినిమా కేట‌గిరీకి ఇది చెందుతుంది. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో-పాకిస్తాన్ వార్- ముఖ్యంగా గరీబ్‌పూర్ యుద్ధంలో తూర్పు సరిహద్దులో ధైర్యంగా పోరాడిన కెప్టెన్ మెహతా, అతడి తోబుట్టువుల అజేయ‌మైన యుద్ధవీరుల‌ కథతో తెర‌కెక్కింది. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్, ప్రియాంషు పైన్యులి నటించిన ఈ చిత్రం నవంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది.

Tags:    

Similar News