పిచ్చి కూతలకు మానసికంగా కుంగిపోయాను: మలైకా
నిరంతరం గూగుల్‌లో ట్రెండింగ్ లో నిలిచే సెలబ్రిటీగా మలైకా అరోరా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది
నిరంతరం గూగుల్‌లో ట్రెండింగ్ లో నిలిచే సెలబ్రిటీగా మలైకా అరోరా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గ్లామరస్ ఫోటోషూట్లు లేదా డేటింగ్ వార్తలతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్‌లోకొస్తుంది. సోషల్ మీడియాల్లో మలైకా గురించి రకరకాల ఘాటైన వ్యాఖ్యలు నిరంతరం వైరల్ అవుతూనే ఉంటాయి.
మలైకా అరోరా సోషల్ మీడియాలో తన గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలను చదివిన తర్వాత తన మనోవేదన గురించి తాజా ఇంటర్వ్యూలో ఓపెనైంది. అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన క్రమంలో మలైకా మరోసారి హెడ్ లైన్స్‌లోకి వచ్చింది. ఇటీవల 'హార్పర్స్ బజార్' అనే మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. తన డే 'మెస్ అప్' గురించి ప్రతికూల వ్యాఖ్యల గురించి ప్రస్థావించింది. ''కొన్నిసార్లు నా గురించి అసహ్యకరంగా రాసినప్పుడు అది నా రోజును గందరగోళానికి గురి చేస్తుంది. కానీ నేను శబ్దాన్ని నిరోధించడంలో మెరుగ్గా ఉన్నాను. యోగా, ధ్యానం సాధన చేయడం, సమయానికి భోజనం నిద్ర వంటి వాటిని బ్యాలెన్స్ చేస్తూ.. మానసికంగా దృఢంగా నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకోగలిగేందుకు చాలా కృషి చేస్తాను'' అని చెప్పింది.
అయితే మలైకాను ఇన్ని ప్రతికూలత మధ్య కూడా సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్, స్టైల్ కంటెంట్ ని అభినందించేవారు కూడా ఉన్నారు. మీరు 48 ఏళ్ల వయస్సులో అద్భుతంగా కనిపిస్తున్నారు అని ఎవరైనా చెప్పినప్పుడు, అది అద్భుతంగా అనిపిస్తుందని, దానిని ఇతరులు అవమానకరమైన రీతిలో అర్థం చేసుకున్నారని నేను అనుకోను అని మలైకా అన్నారు.
నిజానికి మలైకా- అర్జున్ కపూర్ జంట విడిపోయారనే పుకార్లు మొదలయ్యాక మలైకా తన మానసిక స్థితిని బహిర్గతం చేస్తూనే ఉంది. గత నెలలో మలైకా జుహు నివాసంలో అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలకు అర్జున్ అటెండ్ కాకపోవడంతో అది అభిమానులను ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియాలోను ఇద్దరూ దూరంగా ఉన్నారు. దీంతో వారు విడిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తరువాత మలైకా ఒక ఈవెంట్‌లో అర్జున్ నుంచి దూరంగా ఉండటంతో మరోసారి విడిపోవడాన్ని ధృవీకరించారు. ఈ నెల ప్రారంభంలో మలైకా జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం గురించి మాట్లాడటం అందరినీ ఆకర్షించింది. ప్రతి ఒక్కరూ తమ సొంత నిబంధనల ప్రకారం తమ జీవితాలను గడపాలని.. ఇతరులు మీ జీవన విధానాన్ని నియంత్రించకూడదని మలైకా ఇందులో పేర్కొంది.
''మీరు చేసే ప్రతి పనిలో బ్యాలెన్స్ కీలకం. రాత్రంతా డ్యాన్స్ చేయండి.. మరుసటి రోజు యోగా చేయండి. వైన్ తాగండి కానీ మీ గ్రీన్ జ్యూస్ మర్చిపోకండి. మీ హృదయం కోరుకున్నప్పుడు చాక్లెట్ మీ శరీరానికి అవసరమైనప్పుడు కాలే సలాడ్ తినండి. శనివారం హైహీల్స్ ధరించండి.. ఆదివారం చెప్పులు లేకుండా నడవండి. ఎక్కువ తక్కువలతో జీవించండి. కదలండి .. నిశ్చలంగా ఉండండి. మీరు ఎవరో అన్ని వైపులా ఆలింగనం చేసుకోండి! అని కవితాత్మకంగా తన మనోభావాలను రాసింది మలైకా. మీ స్వంత నియమాలను రూపొందించుకోండి. మీ స్వంత మార్గాన్ని అనుసరించండి. ఇతరుల ప్రకారం ఎలా జీవించాలో ఎవరినీ చెప్పనివ్వవద్దు! అని మలైకా నోట్ లో రాసింది.