మలైకా కొత్త రాగం..ఆధారం ఇదేనా?
మలైకా అరోరా- అర్జున్ కపూర్ మధ్య ఐదేళ్ల పాటు ఏ రేంజ్లో ప్రేమాయణం సాగిందో తెలిసిందే. ఇద్దరి మధ్య భారీ వయసు వ్యత్యాసం ఉన్నా
మలైకా అరోరా- అర్జున్ కపూర్ మధ్య ఐదేళ్ల పాటు ఏ రేంజ్లో ప్రేమాయణం సాగిందో తెలిసిందే. ఇద్దరి మధ్య భారీ వయసు వ్యత్యాసం ఉన్నా... నెటి జనుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నా అవేవి పట్టించు కోకుండా ఆ జోడీ ప్రేమని పీక్స్ లోకి తీసుకెళ్లారు. ముంబై వీధుల నుంచి విదేశీ విధుల వరకూ ఎక్కడ చూసినా ఈ జోడీనే కనిపించేది. ఇద్దరి మధ్య అన్యోన్యత చూసి వివాహం చేసుకుంటారనే ప్రచారం బలంగా సాగింది.
కానీ ఇప్పుడా బంధం మధ్య బీటలు వారినట్లు కనిపిస్తోంది. కొన్నినెలలుగా ఇద్దరు దూరంగా ఉంటున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసిన సందర్భాలు ఈమద్య పెద్ద గా కనిపించలేదు. అర్జున్ కపూర్ బర్త్ డే రోజున మలైకా విష్ చేసింది లేదు. ఆ వేడుకల్లో ఎక్కడా ఆమె కనిపించనూ లేదు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ కి మరింత బలమైన సాక్ష్యంగా మారింది. సరిగ్గా ఇదే తరుణలో మలైకా ఓ మిస్టరీ మ్యాన్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.
దీంతో మలైకా కొత్త రాగం కోరుకుంటుందా? అన్నసందేహాలు బలపడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేసింది. `ప్రతి ఆనందం… ప్రేమపూర్వకమైన పదం… ప్రతి చర్య మన ఆత్మ సౌందర్యానికి ప్రతిబింబం’ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. దీంతో మలైకా కొత్త వాడితో ప్రేమలో పడిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. అమ్మడి నుంచి వచ్చిన తాజా హింట్ రెండవ సాక్ష్యంగా కనిపిస్తుంది.
అయితే ఇంతవరకూ మలైకాగానీ, అర్జున్ కపూర్ గానీ విడిపోయినట్లు ఎక్కడా ప్రకటించలేదు. విడిపో యినట్లు ప్రచారం సాగిన సందర్భంలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి వాటికి చెక్ పెట్టారు. కానీ ఇప్పుడా ఛాన్స్ ఇద్దరు తీసుకుంటున్నట్లు కనిపించలేదు. మరి ఇద్దరి మధ్య అసలేం జరుగుతందన్నది? తెలియాల్సి ఉంది.