మైకం క‌మ్మేలా మ‌లైకం అందాల ఆర‌బోత‌?

అదంతా స‌రే కానీ.. ఇప్పుడు మ‌లైకా అరోరా లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తోంది. ఈ బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Update: 2023-09-23 04:25 GMT

అవును.. ఇంతందంగా క‌వ్వించ‌డం ఏ భామ‌కు సాధ్యం కాదేమో! క‌ళ్లు జిగేల్మ‌నేలా ఇంత‌ ఇదిగా యూత్ ని చిల్ చేయ‌డంలో హాటీ మ‌లైకా అరోరా ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈవెంట్ ఏదైనా అక్క‌డ షో స్టాప‌ర్ గా నిల‌వ‌డం ఎలానో.. అంద‌రి క‌ళ్లు త‌న‌పైనే ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌డం ఎలానో ఈ భామ‌కే తెలుసు. జిమ్ కి వెళ్లినా, యోగా సెష‌న్స్ నుంచి తిరిగి వ‌స్తున్నా లేదా ప‌బ్లిక్ మార్కెట్లోకి వెళ్లినా.. ప్ర‌తిసారీ మ‌లైకా కోసం ప్ర‌జ‌లు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూడాల్సిందే. ఇక విమానాశ్ర‌యాల్లో మ‌ల్లా అందాల‌ను క్యాప్చుర్ చేయ‌డానికి ఫోటోగ్రాఫ‌ర్లు ప‌డిగాపులు ప‌డుతుంటారు.


అదంతా స‌రే కానీ.. ఇప్పుడు మ‌లైకా అరోరా లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో అగ్గి రాజేస్తోంది. ఈ బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్ ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ ఫ్రాకులో మ‌లైకా అంద‌చందాలు యువ‌తరాన్ని ఒక రేంజులో క‌వ్విస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. మ‌ల్లా అటూ ఇటూ క‌దిలినా.. లేదా స్థిరంగా నిలుచున్నా .. వంగినా త‌న అందాన్ని ప‌దింత‌లు ఎలివేట్ చేసే డిజైన‌ర్ లుక్ ఇది అన‌డంలో సందేహం లేదు.


మ‌లైకా ఈ కొత్త లుక్ చూడ‌గానే యూత్ కూనిరాగాలు తీస్తున్నారు. మ‌లైకం ఎంతందంగా క‌వ్వించావే అంటూ ఒక‌టే ఇదైపోతున్నారు. వ‌య‌సు 50కి చేరువైనా కానీ ఇంత హాట్ గా క‌నిపించ‌డం మ‌లైకాకే చెల్లింది. అయితే ఇటీవ‌లి కాలంలో మ‌లైకా ఎక్కువ‌గా సోలో అప్పియ‌రెన్స్ కే ప‌రిమితం కావ‌డంతో అర్జున్ తో బ్రేక‌ప్ అయిందంటూ ఒక సెక్ష‌న్ ప్ర‌చారం చేస్తోంది. అయితే ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేందుకు అప్పుడ‌ప్పుడు ఈ ఇద్ద‌రూ జంట‌గా ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ ఇస్తున్నారు.


ఇక మ‌లైకా ఇటీవ‌ల ర‌క‌ర‌కాల మోడ‌లింగ్ అసైన్ మెంట్స్, రియాలిటీ షోల‌తో బిజీ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు త‌న కుమారుడిని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేసేందుకు మ‌లైకా ఇప్ప‌టి నుంచే ఎంతో భారీ ఏర్పాట్ల‌లో ఉంద‌ని కూడా స‌మాచారం అందుతోంది. ఇటీవ‌ల మ‌లైకా నృత్యప్ర‌ద‌ర్వ‌న‌లు ప‌రిమిత‌మైపోయాయ‌ని అభిమానుల్లో ఒక‌ర‌క‌మైన ఆందోళ‌న నెల‌కొంది. కెవ్వు కేక‌.. త‌ర్వాత మ‌లైకా తిరిగి టాలీవుడ్ లో మ‌రో ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌లేదు.అటు బాలీవుడ్ లోను ఈ బ్యూటీకి అవ‌కాశాలు త‌గ్గాయి.

Tags:    

Similar News