క్లాసిక్ స్వర్వోస్కీ చీరలో మ‌లైకా మెరుపులా!

తాజాగా అమ్మ‌డు ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన చీరందంలో మెల్ బోర్న్ రెడ్ కార్పెట్ నే హీటెక్కించింది.

Update: 2024-08-17 20:30 GMT

మ‌లైకా అరోరా ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో తానో బ్రాండ్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. 50 ఏళ్ల వ‌య‌సులోనూ అమ్మ‌డు ఎలాంటి దుస్తులు ధ‌రించినా? హైలైట్ అయ్యే తీరు మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. చిట్టిపొట్టి దుస్తులు...స్విమ్ షూట్ లోనే కాదు. అవ‌స‌రం మేర అమ్మ‌డు ఎంపిక చేసుకునే సంప్ర‌దాయ దుస్తుల్లో సైతం అంతే బ్యూటీని హైలైట్ చేస్తుంది. తాజాగా అమ్మ‌డు ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన చీరందంలో మెల్ బోర్న్ రెడ్ కార్పెట్ నే హీటెక్కించింది.

క్లాసిక్ స్వర్వోస్కీ చీర లో మ‌లైకా మెరుపు అందం మాములుగా లేదు. ఆ బ్యూటీని చూడ‌ట‌నికి రెండు క‌ళ్లు స‌రిపోతాయా? అన్న సందేహం రాక మాన‌దు. అంతగా రెడ్ కార్పెట్ పై హైలైట్ అయింది. తెలుపు రంగు మెరుపుల చీర‌పై మ్యాచింగ్ బ్లౌజ్ ధ‌రించి న‌డుంపై చేయి వేసుకుని అలా వాక్ చేసుకుంటూ వ‌స్తుంటే? ఎవ‌రీ అందం అనుకోవ‌డం ఖాయం. మ‌లైకా అన్న సంగ‌తి మాత్రం కొన్ని నిమిషాల పాటు మ‌ర్చిపోయేం త‌గా మ‌త్తులో ముంచేస్తుంది.

ప‌ట్టి ప‌ట్టి చూస్తే త‌ప్పై ఆమె మ‌లైకా అన్న సంగ‌తి గుర్తించ‌డం క‌ష్టం. 50 ఏళ్ల వ‌య‌సులోనే అమ్మ‌డి స్కిన్ టోన్ లో ఎలాంటి మార్పులు ప‌ట్టుకోవ‌డం క‌ష్టం అన్నంత‌గా ముస్తాబైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంతర్జా లంలో వైర‌ల్ గా మారింది. మ‌లైకా అందానికి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. చేతిలో సినిమాలు లేక‌పోయినా? ఇంకా యాక్టివ్ గా కొన‌సాగుతుంది అంటే అమ్మ‌డిలో ఈ మెరుపే కార‌ణం అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

అమ్మ‌డిని వెండి తెర‌పై హిందీ అభిమానులు చూసుకుని ఏడాది దాటిపోయింది. ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న లేదు. ఇటు సౌత్ లో అయితే అవ‌కాశాలే లేవు. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ అర్జున్ క‌పూర్ తో డేటింగ్ మ్యాట‌ర్లో క‌నిపించేది. ఇప్పుడా చ‌ర్చ కూడా ఎక్క‌డా లేదు.

Tags:    

Similar News