ఒంటరి దీవిలో ఒంటరిగా మలైకా
సామరస్యంగా ఆ ఇద్దరూ స్నేహంగా ఉంటున్నారు తప్ప కలిసి లేరు! అని కథనాలు వైరల్ అయ్యాయి.
ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ రివేరా ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే ప్లేస్ ఇది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమైంది మలైకా అరోరా. అయితే తనతో పాటు బోయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఎక్కడా కనిపించనేలేదు. దీంతో ఇటీవలి బ్రేకప్ పుకార్లు నిజమని నమ్మాల్సి వస్తోంది. నిజానికి ప్రేమలో ఉన్న కొత్తలో మలైకా- అర్జున్ కలిసే ఇలాంటి బీచ్ డెస్టినేషన్స్ కి వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ చెలిమి కనిపించడం లేదనేది బాలీవుడ్ భోగొట్టా. అర్జున్ చాలా రోజుల క్రితమే కొత్త గాళ్ ఫ్రెండ్ కి సన్నిహితుడిగా మారాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. సామరస్యంగా ఆ ఇద్దరూ స్నేహంగా ఉంటున్నారు తప్ప కలిసి లేరు! అని కథనాలు వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఫ్రెంచ్ రివేరా వెంబడి ఎండలో సూర్య కాంతిలో తడిసి ముద్దయిన మలైకా అరోరా ఫోటోలు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి. మధ్యధరా ప్రకంపనలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయ్ అంటూ అభిమానులు దీనిపై కామెంట్ చేస్తున్నారు. అక్కడ నీలం రంగు నీటిపై పెద్ద రాతి శిఖరాలతో ఉన్న రెస్టారెంట్ సౌందర్యం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. అక్కడ తాజా సీఫుడ్ ట్రీట్ ని మలైకా మిస్ కాలేదు.
ఈజ్ నైస్ అనే ప్రాంతం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన గ్రామంలోను మలైకా బస చేసింది. అక్కడి నుంచి లైవ్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సందడిగా ఉండే నగర జీవితానికి దూరంగా ప్రశాంతతను పొందే అనేక మంది ప్రముఖులకు ఈ చోటు ఎంతో ఇష్టమైనది. మలైకా అరోరా కూడా హోటల్ చాటేయు డి లా చెవ్రే డి ఓర్ లో స్టే చేసింది. ఇది ఒక సుందరమైన ప్రకృతి దృశ్యంలా కనిపిస్తుంది. భారీ ఆకుపచ్చ పరిసరాలు.. స్థానికంగా వికసించే పువ్వులు .. నేపథ్యంలో సముద్రాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరించే థీమ్ వీటన్నిటినీ అక్కడ గెస్ట్‌లు ఆస్వాధించగలరు.
చిరు తిండిలో రాజీ అన్నదే లేదు:
ఫ్రాన్స్‌లో మలైకా అరోరా సెలవుదినాలను ఆస్వాధిస్తోంది. అంతేకాదు అక్కడ రెస్టారెంట్లలో అరుదైన వంటకాలను ఆరగిస్తూ ఆ ఆనందాన్ని ఎదుటివారికి పంచింది. మెయిన్ స్ట్రీమ్ ఫుడ్ లేదా ఆఫ్‌బీట్ తినుబండారాలను మలైకా ఫుల్ గా కవర్ చేసింది. వెరైటీల ఆస్వాధన గురించే ఈ ట్రిప్ లో మచ్చటించాలి. సెయింట్ ట్రోపెజ్‌లోని ఫలాఫెల్ అండ్ కో అటువంటి ప్రదేశం. ఫ్రెంచ్ రివేరా పర్యటనలో మెడిటరేనియన్ క్లాసిక్ ని మలైకా మిస్ కాలేదు. ఎవరైనా ఫ్రెంచ్ రివేరాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నప్పుడు దాన్ని మిస్ చేయకూడదనే సంకేతం ఇదన్నమాట.
మర్చిపోలేని లొకేషన్ ఇది:
సుందరమైన ప్రకృతి దృశ్యాలు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం మరియు మధ్యధరా శోభతో ఫ్రాన్స్‌కు దక్షిణాన ఈ తీకం జంటలు జనం నుంచి తప్పించుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ వేసవిలో మలైకా అరోరా అద్భుతమైన తీరప్రాంత పట్టణమైన సెయింట్ ట్రోపెజ్‌లోని ఇంట్లో కనిపించింది. ఫ్రెంచ్ రివేరా నడిబొడ్డున నెలకొని ఉన్న సెయింట్ ట్రోపెజ్ అద్భుతమైన బీచ్‌లు, మర్చిపోలేని రాత్రి జీవితం.. వెరైటీ వంటకాలకు ప్రసిద్ధి చెందిన చోటు. విశ్రాంతి దాంతో పాటు సాహసాలు రెండింటినీ కోరుకుంటూ నచ్చిన వంటకాలు తింటూ స్వేచ్ఛా విహారం చేసేందుకు జంటలు ఈ స్థలాన్ని ఎంచుకుంటాయి.