మలైకా కొడుకుకి క్లాస్‌మేట్స్ చిక్కు ప్రశ్న!
ఓవైపు విదేశీ విహారయాత్రలతో బిజీగా ఉన్నా మరోవైపు మ్యాగజైన్ ఇంటర్వ్యూలతోను అభిమానులకు టచ్ లో ఉంది మలైకా.
ప్రస్తుతం పారిస్‌లో ఉన్న మలైకా అరోరా ఒలింపిక్స్ లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ భామ విదేశీ విహారంలో తనతో పాటే కొత్త బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని ప్రచారం సాగుతోంది. మలైకా జాలీ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ ని వేడెక్కిస్తున్నాయి. ఓవైపు విదేశీ విహారయాత్రలతో బిజీగా ఉన్నా మరోవైపు మ్యాగజైన్ ఇంటర్వ్యూలతోను అభిమానులకు టచ్ లో ఉంది మలైకా.
ఇటీవల తన 21 ఏళ్ల కుమారుడు అర్హాన్‌తో తన అనుబంధం, సమీకరణం గురించి పాపులర్ మ్యాగజైన్ తో మలైకా ముచ్చటించింది. బతుకుతెరువు కోసం మీ అమ్మ (మలైకా) ఏం చేస్తుంది? అంటూ అర్హాన్ ని తన స్నేహితులు అడిగారని మలైకా అన్నారు. దానికి అతడి వద్ద సరైన సమాధానం లేదు! అని కూడా వెల్లడించింది. హార్పర్స్ బజార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా ఈ విషయంపై వ్యాఖ్యానించారు. నేను సరిగ్గా ఏం చేస్తానో తెలియక తన స్నేహితులు గందరగోళంలో ఉన్నారని నా కొడుకు నాకు చెప్పాడు. సినిమాలు చేస్తాను..ప్రత్యేక పాటలు చేసాను.. VJ, మోడల్, బుల్లితెర హోస్ట్.. జడ్జ్..ఇవన్నీ అర్హతలు. కానీ ఒక్కోసారి పిల్లలు తమ తల్లి వృత్తి గురించి కన్ఫ్యూజ్ అవుతారు. వారి స్నేహితులు కూడా గందరగోళానికి గురవుతారు.. అని మలైకా చెబుతోంది. మలైకా మల్టీ ట్యాలెంటెడ్. నటి, టీవీ హోస్ట్, డ్యాన్స్ రియాలిటీ షో జడ్జి, మోడల్, డాన్సర్.. కానీ చిన్న మనసులు దానిని అర్థం చేసుకోలేవు. అయితే నేను ఖచ్చితంగా ఏం చేయాలో నేను ఎందుకు ఆలోచించాలి? నాకు మంచి అనుభూతిని కలిగించేది నేను చేస్తాను! అని మలైకా చెప్పింది.
మలైకా వయసు 50కి దగ్గరపడింది. ఇప్పటికీ ఇంకా తన వయసు 26 అన్నంతగా రూపాన్ని మెయింటెయిన్ చేస్తోంది. దీని రహస్యం ఏమిటి? అని ప్రశ్నించగా... `మీరు 48 ఏళ్ల వయసులో అద్భుతంగా కనిపిస్తున్నారు` అని ఎవరైనా చెప్పినప్పుడు అది అద్భుతంగా అనిపిస్తుంది. ప్రజలు దానిని అవమానకరమైన రీతిలో అర్థం చేసుకున్నారని నేను అనుకోను. ఇది ఒక అభినందన. 48 ఏళ్ళ వయసులో నేను చూసేవన్నీ చూడగలిగితే, అది నా కృషి, అంకితభావం, ఏకాగ్రత కారణంగానే సాధ్యమైందని మీకు అర్థమవుతుంది. `అలా ఉండడానికి నువ్వేం చేస్తావు?` అని ఎవరైనా అడిగితే చాలా గొప్పగా అనిపిస్తుంది.. అని కూడా మలైకా కొంత గర్వంగా అన్నారు.
మలైకా అరోరా నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. 19 సంవత్సరాల కాపురం తర్వాత 2017లో ఈ జంట విడిపోయారు. వారి కొడుకు అర్హాన్ వయసు ఇప్పుడు 21. అర్బాజ్ ఇటీవలే తన మేకప్ ఉమెన్ షురా ఖాన్‌ని పెళ్లాడాడు. అయితే మలైకా యువహీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ గురించి ప్రజలకు తెలుసు. కానీ ఈ ఇద్దరూ కూడా బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు మలైకా కొత్త బోయ్ ఫ్రెండ్ తో షికార్ చేస్తోందని కథనాలొస్తున్నాయి.