ఫోటో స్టోరి: ఫలక్‌నుమా దాసినిలా రెబల్ పిల్ల!
మాళవిక మోహనన్ ... నేటితరంలో ట్రెండీ లుక్ తో మతులు చెడగొడుతున్న ప్రతిభావని.
మాళవిక మోహనన్ ... నేటితరంలో ట్రెండీ లుక్ తో మతులు చెడగొడుతున్న ప్రతిభావని. నటన .. ఫ్యాషన్ సెన్స్ రెండిటిలోను ఈ బ్యూటీ స్పీడ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాల్లో ఇప్పటికే మాళవిక హాట్ ఫోటోషూట్లకు బోలెడంత గిరాకీ ఉంది. లక్షల్లో అభిమానులు ఇన్ స్టా వేదికగా మాళవికను అనుసరిస్తున్నారు. తాజాగా మరో స్పెషల్ ఫోటోషూట్‌తో మాళవిక అభిమానులకు టచ్‌లోకి వచ్చింది. ఈ కొత్త లుక్ నిజంగా స్టన్నర్ గా నిలిచింది.
పచ్చని అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న బెంగాళ్ టైగర్ ప్రింటెడ్ గౌన్‌ని మాళవిక ధరించింది. ఇక నాభి కేంద్రంగా ఆ చొక్కాను ముడి వేసిన మాళవిక మాస్ టచ్ ఇచ్చింది. మెడ నిండుగా ఒకటికి పది గొలుసులు ధరించిన మాళవిక అంతే రెబల్ స్టైల్ లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని రియల్ ఫలక్ నుమా దాసిని లా కనిపించింది.
ఈ సరికొత్త ఫోటోగ్రాఫ్ చూడగానే, `రాజా సాబ్` బ్యూటీ రెబలిజంలో తగ్గేదేలే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చూడగానే హైదరాబాద్ లేదా చెన్నై గల్లీలోని ఫక్తు మాస్ రాణీలా కనిపిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా మాళవిక ఈ క్రేజీ రెబలియన్ లుక్ కి క్రెడిట్ కొట్టేసింది. రాజా సాబ్ తో పాన్ ఇండియా హిట్టు కొట్టేయాలని కలలుగంటోంది. ఇటీవలే తంగళన్ చిత్రంలో తన పాత్రతో అదరగొట్టిన మాళవిక మునుముందు పాన్ ఇండియన్ స్టార్ గా ఏలాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాల్లోను చెలరేగిపోతోంది.
మాళవిక నటించిన రాజా సాబ్ 2025 లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుదల కానుంది. ఈలోగానే సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి యాక్షన్ థ్రిల్లర్ `యుధ్రా`తో మాళవిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. రవి ఉద్యవార్ యుధ్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. నిర్మాతలు ఈ చిత్రం నుండి ట్రైలర్, పాటను విడుదల చేయగా వాటికి చక్కని స్పందన వస్తోంది.