వ‌శిష్ట‌కు మ‌రో మెగా ఆఫర్ రెడీగా ఉందా?

యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట‌కు మ‌రో మెగా ఆఫర్ రెడీగా ఉందా? అంటే అవున‌నే అంటున్నాయి మెగా కాంపౌండ్ వ‌ర్గాలు.

Update: 2024-10-09 18:45 GMT

యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట‌కు మ‌రో మెగా ఆఫర్ రెడీగా ఉందా? అంటే అవున‌నే అంటున్నాయి మెగా కాంపౌండ్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం వ‌శిష్ట ...మెగాస్టార్ చిరంజీవి హీరోగా సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ `విశ్వంభ‌ర` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మెగాస్టార్ పై షూట్ కూడా పూర్త‌యింది. సీజీ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉన్న సినిమా కావడంతో? రిలీజ్ జ‌న‌వ‌రి కి ఫిక్స్ చేసారు. సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

`బింబిసార` స‌క్సెస్ చూసి మెగాస్టార్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చారు. అలా వ‌శిష్ట మెగా కాంపౌండ్ లో కి అడుగు పెట్టాడు. అయితే విశ్వ‌భ‌ర రిలీజ్ అనంత‌రం స‌క్సెస్ అయితే మ‌రో ఛాన్స్ కూడా అదే కాంపౌండ్ లో ఉంద‌నే వార్త తెర‌పైకి వ‌స్తోంది. నేరుగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకు అన్ని ర‌కాలుగా అర్హుడే. రెండ‌వ సినిమానే చిరంజీవితో తెర‌కెక్కిస్తున్నాడు? అంటే అత‌డు ఎంత‌టి ప్ర‌తిభావంతుడ‌న్న‌ది అంచ‌నా వేయోచ్చు.

బాకీ ఉంది కేవ‌లం స‌క్సెస్ మాత్ర‌మే. అది చేసి చూపించ గ‌ల్గితే చ‌ర‌ణ్ తో ఛాన్స్ లాంఛ‌న‌మే. అయితే ఆసినిమా ప‌ట్టాలెక్క‌డానికి మాత్రం స‌మ‌యం ప‌డుతుంది. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ బుచ్చిబాబు..సుకుమార్ సినిమాల‌తో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బుచ్చిబాబు ద‌ర్శక‌త్వంలో త‌న 16వ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే సుకుమార్ తో 17వ సినిమా చేస్తాడు.

ఈ రెండు పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి రెండేళ్లు అయినా స‌మ‌యం ప‌డుతుంది. ఈలోపు వ‌శిష్ట్.. చ‌ర‌ణ్ పాన్ ఇండియా ఇమేజ్ కి త‌గ్గ క‌థ సిద్దం చేసుకుని రెడీగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌టికే వ‌శిష్ట్ వ‌ద్ద స్టోరీ బ్యాంక్ ఉన్న‌ట్లు గ‌తంలో తెలిపాడు. వాటికి కాస్త మెరుగులు దిద్దితే స‌రిపోతుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News