మల్లీశ్వరితో సోలో యాక్షన్ చిత్రమా?
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతోన్న సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగల నటి. వెండి తెరపై తాను చేయని ప్రయోగం అంటూ లేదని రకరకాల పాత్రలతో ప్రూవ్ చేసింది. రొమాంటిక్ పాత్రలతో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. ఇక యాక్షన్ చిత్రాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ చిత్రాల్లో పెట్టింది పేరుగా దూసుకుపోతుంది. `ధూమ్`...`టైగర్ జిందా హై` చిత్రాల్లో యాక్షన్ లోనూ తనదైన మార్క్ వేసింది.
హీరోకి ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ సోలో యాక్షన్ చిత్రాలు మాత్రం ఇంతవరకూ ట్రై చేయలేదు. అయితే ఇప్పుడా అవకాశం ముందున్నట్లు కనిపిస్తుంది. అమ్మడితో ఏకంగా అలీ అబ్బాస్ భారీ యాక్షన్ చిత్రమే ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. క్యాట్ లో కంగనని మించిన గొప్ప యాక్షన్ నటిని గుర్తించి అలీ అబ్బాస్ ఈ ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
`మేరే బ్రదర్ కీ దుల్హాన్`.. `టైగర్ జిందా హై`..`భారత్` లాంటి చిత్రాలు తెరకెక్కాయి. మేరే బ్రదర్ కి మిన హాయిస్తే మిగిలిన రెండు చిత్రాలు భారీ యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కినవే. సల్మాన్ ఖాన్...కత్రినా జంటగా నటించిన టైగర్...భారత్ చిత్రాలు భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించనే. రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించనవే. ఇందులో కత్రినా...సల్మాన్ కి ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఆ చిత్రాల స్పూర్తితోనే మనీష్ శర్మ టైగర్ -3 తెరకెక్కించాడు. కానీ ఇది ఆశించిన ఫలితం సాధించలేదు.
అమ్మడిలో ఆ ట్యాలెంట్ చూసే అబ్బాస్ ఇప్పుడు ఏకంగా క్యాట్ తో సోలో యాక్షన్ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. అవి ఓ కొలిక్కి రాగానే అధికారికంగా ప్రాజెక్ట్ గురించి ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కత్రినా కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఆమె గర్బం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరామంలో ఉంది.