ప్రేమలు పాపకు క్రేజీ ఆఫర్.. తమన్ ట్విస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నాడంట. తమన్ ఇండస్ట్రీలోకి నటుడుగానే ఎంట్రీ ఇచ్చాడు.

Update: 2024-05-30 04:49 GMT

ప్రేమలు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు. ఈ అమ్మడు ప్రేమలు కంటే ముందు చాలా సినిమాలు చేసింది. అయితే ప్రేమలు మూవీ మాత్రం మలయాళంతో పాటు ఇతర భాషలలో కూడా హిట్ కావడం, మమిత బైజు క్యారెక్టర్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు మమిత బైజు యూత్ క్రష్ గా మారిపోయింది.

ఈ బ్యూటీకి చేయబోయే సినిమాల గురించి తెలుసుకోవాలనే ఇంటరెస్ట్ అందరికి పెరిగింది. ఈ ఏడాది రెబల్ సినిమాతో కోలీవుడ్ లోకి మమిత బైజు అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రెబల్ మూవీలో జీవీ ప్రకాష్ కుమార్ కి జోడీగా మమిత నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఈ బ్యూటీ ఛాన్స్ పట్టేసింది.

భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తోన్న లైకా ప్రొడక్షన్స్ అధర్వ మురళీతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో అధర్వ మురళీకి జోడీగా మమిత బైజుని హీరోయిన్ గా ఖరారు చేసారంట. ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా బయటకొచ్చింది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నాడంట. తమన్ ఇండస్ట్రీలోకి నటుడుగానే ఎంట్రీ ఇచ్చాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో నటించాడు. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా మరి బిజీ కావడంతో యాక్టింగ్ వైపు దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు.

అయితే ఈ సారి మాత్రం పూర్తిస్థాయి రోల్ లో ఈ కొత్త సినిమాలో కనిపించబోతున్నాడంట. అతను ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇక మమిత బైజు హీరోయిన్ గా నటిస్తూ ఉండటం ఈ చిత్రంలో క్రేజ్ పెరిగింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందంట.

మమిత బైజుని టాలీవుడ్ కి పరిచయం చేయాలని బడా నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కథలు డిస్కషన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మమిత కూడా చాలా ఓ మంచి కంటెంట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. ఏదో కమర్షియల్ హీరోయిన్ లా కాకుండా మంచి కథాబలం ఉన్న మూవీస్ కోసం వెయిట్ చేస్తోంది.

Tags:    

Similar News