సెట్స్ లో డిప్రెషన్ లోకి వెళ్లిన హీరోయిన్!
మహమ్మారితో మనీషా పెద్ద పోరాటమే చేసి నెగ్గి నేడు ఎంతో మందిలో స్పూర్తిని నింపారు. ఇటీవలే 'హీరామండి' వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే
నేపాల్ బ్యూటీ మనీషా కోయిరాలా సినీ జర్నీ గురించి తెలిసిందే. తెలుగు..తమిళ్..హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. వెడితెరపైనే కాదు..బుల్లి తెరపైనా సత్తా చాటిన నటి. అలాగే మనీషా కోయిరాలా క్యాన్సర్ బారిన పడటం కోలుకోవడం గురించి తెలిసిందే. మహమ్మారితో మనీషా పెద్ద పోరాటమే చేసి నెగ్గి నేడు ఎంతో మందిలో స్పూర్తిని నింపారు. ఇటీవలే 'హీరామండి' వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.
మల్లీకాజన్ పాత్రలో మనీషా కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ సిరీస్ పెద్ద విజయం సాధించడంతో నటీనటులందరికీ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయి. అయితే ఈవెబ్ సిరీస్ షూట్ లో ఎంతో అసౌకర్యానికి గురైన విషయాన్ని మనీషా కోయిరాలో ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. 'జీవితంలో నేను కృతజ్ఞతతో ఉండాల్సిన క్షణాలు చాలా ఉన్నాయి. ఎన్నో ముఖ్యమైన పాత్రలు చేశాను. గొప్ప దర్శక నిర్మాతలతో పని చేశాను. కాలం నాకు పెట్టిన పరీక్షలో నెగ్గాను.
భగవంతుడు దయతో జీవించడానికి నాకు రెండో అవకాశం లభించింది. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత ఒడి దుడుకులు చూశా. కాలం పెద్ద గురువు. నేను ఇప్పుడు దాని విలువను తెలుసుకున్నా. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత జీవితం మునుపటిలా ఉండదు. తెలియకుండానే శరీరంలో మార్పులు వస్తాయి. 'హీరమండి' షూటింగ్ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా. సడెన్‌గా ఆలోచనలు మారిపోయేవి. మూడ్ స్వింగ్స్ ఎక్కువయ్యాయి. ముందు షూటింగ్‌ను పూర్తి చేయాలి.
తర్వాత ఆరోగ్యంపై శ్రద్థ పెట్టాలి అని నాలో నేనే ఎన్నిసార్లు అనుకున్నా. నా పరిస్థితిని దర్శకుడు సంజయ్ అర్థం చేసుకున్నారు. 12 గంటలు కాగానే నా పాత్ర చిత్రీకరణ ఆపేసేవారు. నా భయాన్ని, ఆందోళనను ఆయన అర్థం చేసుకున్నారు. ఆయనలా సహకరించకపోతే ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడేదాన్ని' అని మనీషా అన్నారు. 2012లో మనీషా కోయిరాలా అండాశయ క్యాన్సర్ బారిన పడిన 2015లో కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో ప్రయత్నించి అవకాశాలందుకుంటున్నారు.