.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

'భార‌తీయుడు' జంట చాన్నాళ్ల‌కు..

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ప్రస్తుతం 'కల్కి 2898 AD' భారీ విజయంతో దూసుకుపోతున్నాడు

Update: 2024-06-30 13:30 GMT

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ప్రస్తుతం 'కల్కి 2898 AD' భారీ విజయంతో దూసుకుపోతున్నాడు. అదే సమయంలో శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన తన తదుపరి చిత్రం భారతీయుడు 2ను చురుకుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలై 12న‌ థియేటర్లలో ఘ‌నంగా విడుద‌ల చేయ‌నున్నారు.

అయితే భార‌తీయుడులో క‌మ‌ల్ హాస‌న్‌తో రొమాన్స్ చేసిన మనీషా కొయిరాలా చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల కమల్ హాసన్‌ను కలిశారు. సినిమా లైఫ్‌..రియ‌ల్ లైఫ్ లో త‌మ‌ అనుభవాల గురించి వారు ఒక‌రితో ఒక‌రు చ‌ర్చించారు. మనీషా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ అరుదైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి త‌న హీరోతో మళ్లీ కనెక్ట్ అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

నాకు పని చేసే అవకాశం లభించిన తెలివైన స్టార్‌ల‌లో ఒకరు.. పుస్తకాలు.. సినిమాలు... ఇప్పుడు ఫ్యాషన్ అతడి ప్రపంచం!! ఆయ‌న‌ ఒకరి మనసును, ఆత్మను విస్తరించే అద్భుతమైన పుస్తకాలను సిఫారసు చేశాడు.. జీవితంపై అతడి ప్రత్యేకమైన, లోతైన పరిశీలనలు దశాబ్దాల క్రితం నన్ను ఆశ్చర్యపరిచాయి.. అతడి సినిమాటిక్ అవగాహన అసమానమైనది.. నేను అతడితో చాలా గంటలు మాట్లాడగలను లేదా అతడు గంటల తరబడి మాట్లాడటం వినగలను. కమల్ హాసన్ జీ మీరు చేసే అన్నింటికీ .. మీరు చేసిన అన్నిటికీ ధన్యవాదాలు!! నేను మిమ్మ‌ల్ని కలిసిన ప్రతిసారీ మీరు నన్ను ఆశ్చర్యపరచడం మానేయరు!!''అని మ‌నీషా ఎమోష‌న‌ల్ అయ్యారు.

అభిమానులు కామెంట్స్ సెక్షన్ లో ఈ జోడీ తిరిగి స్క్రీన్‌పై క‌నిపించాల‌ని ఆత్రుతను వ్యక్తం చేశారు. అయితే వారి కల స‌మీప భ‌విష్య‌త్‌లో నెరవేరుతుందో లేదో చూడాలి. ప్ర‌స్తుతానికి ఈ వైరల్ ఫోటో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

Tags:    

Similar News