మనోరథంగల్.. ఇదేదో కొత్తగా ఉందే..

'మనోరథంగల్' వెబ్ సిరీస్‌లో మలయాళ సినీ పరిశ్రమలోని సుప్రసిద్ధ నటులు తమ నటనతో అలరించనున్నారు.

Update: 2024-07-16 10:03 GMT

ఇటీవల మలయాళ సినిమా పరిశ్రమ అత్యున్నత స్థాయికి ఎదిగింది. 'ఆడు జీవితం', 'ముంజుమ్మల్ బాయ్స్', 'ఆవేశం', 'భ్రమయుగం', 'ప్రేమలు' వంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలో, మలయాళ వెబ్ సిరీస్ కూడా తమ ప్రత్యేకతను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు, మలయాళంలో మరో క్రేజీ వెబ్ సిరీస్ 'మనోరథంగల్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'మనోరథంగల్' వెబ్ సిరీస్‌లో మలయాళ సినీ పరిశ్రమలోని సుప్రసిద్ధ నటులు తమ నటనతో అలరించనున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ వంటి టాప్ సెలబ్రిటీలందరూ ఈ వెబ్ సిరీస్‌లో భాగమయ్యారు.

రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరిపిన ఈ సిరీస్, ఇటీవలే ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఆగస్టు 15 నుంచి ఈ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. ఇక విడుదల చేసిన ట్రైలర్ లో విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మనిషిలోని ప్రతీ ఏమోషన్ ను హైలెట్ చేసే విధంగా సీన్స్ ఉన్నట్లు అర్ధమవుతుంది. ప్రేమ, జాలి, దయ, భయం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను హైలెట్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది.

మలయాళ ప్రముఖ ఎమ్‌టీ వాసుదేవర్ నాయర్ రచించిన కథ ఆధారంగా 'మనోరథంగల్' వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. ఈ సిరీస్ 9 భాగాలుగా ఉంటుంది. 8 మంది స్టార్ డైరెక్టర్లు ఈ అంథాలజీని తెరకెక్కించారు. ప్రియదర్శన్, రంజిత్, సంతోష్ శివన్, శ్యామ్ ప్రసాద్, జయరాజ్, అశ్వతి, రతీశ్ అంబట్, మహేశ్ నారాయణన్ వంటి ప్రముఖ దర్శకులు ఈ వెబ్ సిరీస్‌లో భాగమయ్యారు.

ఒక్కో భాగం సుమారు 50 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లోని ప్రతి భాగం ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి కథలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా మనోరథంగల్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది.

Full View


Tags:    

Similar News