చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుండే!
ప్రస్తుతానికి కొన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయిందన్న సంగతి ఆలస్యంగా రివీల్ చేసింది
కొంత మంది హిట్ అయిన సినిమాల గురించి అందులో నేనే నటించాల్సి ఉందని ఆ సినిమా హిట్ అయితే మీడియా ముందుకొచ్చి చెబుతుంటారు. అనవసరంగా ఆ ఛాన్స్ వదులుకున్నానని వాపోతుంటారు. అందుకు రకరకాల కారణాలు ఉంటాయనుకోండి. ఎవరి కారణాలు వారివి. వారికి రాసిపెట్టులేదనుకోవడం తప్ప! తప్పంతా వాళ్లదే అనడానికి లేదు. తాజాగా ఈ జాబితాలో మానుషీ చిల్లర్ కూడా చేరిపోయింది. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఆపరేషన్ వాలైంటెన్' సినిమాతో అమ్మడు టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిదందే.
తొలి సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతానికి కొన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయిందన్న సంగతి ఆలస్యంగా రివీల్ చేసింది. `అర్జున్ రెడ్డి` రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ బాలీవుడ్ లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇందులో కియారా అద్వాణీ పోషించిన పాత్రకి సందీప్ రెడ్డి తొలుత మానుషీనే తీసుకోవాలనుకున్నారుట. కానీ ఛాన్స్ అప్పుడు అమ్మడు రిజెక్ట్ చేసిందిట. షాహిద్ కపూర్ సరసన ఛాన్స్ అని తెలియక రిజెక్ట్ చేసానని తెలిపింది. అందుకు కారణంగా లేకపోలేదు.
అప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో బిజీగా ఉందిట. ఆ ఏడాది కిరీటం కూడా గెలుచుకున్నా. ఆ బిజీలో పడి కబీర్ సింగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. ఆ సినిమా చాలా గొప్పగా ఉందని...ఆ తర్వాత సందీప్ చేసిన యానిమల్ చూసానని....అప్పటి నుంచి అతని సినిమాలకు అభిమానిగా మారిపోయినట్లు తెలిపింది. అందులో గీతాంజలి పాత్ర ఎంతో గొప్పగా ఉంటుందని పొగిడేసింది. అలాగే సందీప్ కలిసి పనిచేసే ఛాన్స్ వస్తే ఈసారి మాత్రం వదులుకోనని తెలిపింది.
ప్రీతి పాత్ర తర్వాత కియారా అద్వాణీ బాలీవుడ్ ఎంత బిజీ అయిందో తెలిసిందే. హీరోయిన్ గా కొత్త అవకాశాలు అమ్మడి ఇంట క్యూ కట్టాయి. అదే వేడిలో వరుసగా అడ్వాన్సులు అందుకుంది. అటుపై సిద్దార్ధ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా ప్యామిలీ లైఫ్ లోనూ...ప్రోఫెషనల్ లైప్ లోనూ స్తిరపడిపోయింది.