నిలువెత్తు అందం చీర కడితే..!
సినిమాలే కాదు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా తన టాలెంట్ చూపిస్తుంది మానుషి.
2017 లో మిస్ వరల్డ్ గా కిరీటాన్ని దక్కించుకున్న అందాల భామ మానుషి చిల్లర్ మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టి మిస్ వరల్డ్ అయ్యాక వెండితెరకు పరిచయమైంది. 2022 లో సామ్రాట్ పృధ్వి రాజ్ తో తెరంగేట్రం చేసిన మానుషి ఈ ఏడాది 3 సినిమాలు చేస్తుంది. అందులో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, తెహ్రాన్ తో పాటుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేసిన ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఉంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెలుగు, హిందీ బైలింగ్వెల్ మూవీగా వస్తుంది. ఈ సినిమాతో మానుషి చిల్లర్ తెలుగు తెరకు పరిచయమవుతుంది.
ఆల్రెడీ మోడల్ గా తన కెరీర్ సూపర్ ఫాం లో ఉన్న మానుషి చిల్లర్ సినిమాల్లో కూడా రాణించాలని చూస్తుంది. సినిమాలే కాదు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా తన టాలెంట్ చూపిస్తుంది మానుషి.
లేటెస్ట్ గా శారీ లుక్స్ తో ముద్దొచ్చేస్తుంది అమ్మడు. ప్రతి శారీ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. నా కథ చదువుతున్నారా అంటూ తెల్లటి శారీలో వయ్యారాలు ఒలకపోస్తుంది అమ్మడు. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్ అంతా కూడా మానుషిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
నిలువెత్తు అందానికి చీర కడితే ఎలా ఉంటుందో మానుషి శారీ ఫోటోస్ కూడా అలానే ఉన్నాయి. దాదాపు ఆమెకు చేసిన కామెంట్స్ లో కూడా ఇదే టైప్ లో వర్ణించేస్తున్నారు. అటు సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా ఆడియన్స్ కు ఎంగేజ్ అయ్యేలా రకరకాల ఫోటో షూట్స్ తో మెయిన్ టైన్ చేస్తుంది మానుషి. అయితే ప్రస్తుతానికి గ్లామర్ షోకి కొద్దిగా దూరం ఉంటుంది అమ్మడు స్కిన్ షో కూడా చేసేందుకు సై అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది.
మోడల్ గా సక్సెస్ అయిన మానుషి హీరోయిన్ గా కూడా తన మార్క్ చూపించాలని అనుకుంటుంది. వరుణ్ తేజ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మిస్ వరల్డ్ ని కచ్చితంగా మన ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. హీరోయిన్స్ కొరత ఉన్న టాలీవుడ్ లో మానుషి వస్తే మాత్రం ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు. మరి మానుషి రాబోతున్న సినిమాల ఫలితాలు ఆమెను ఏ స్థాయికి తీసుకెళ్తాయన్నది చూడాలి. హీరోయిన్ గా తన టార్గెట్ సీరియస్ గానే పెట్టుకున్న మానుషి అందుకోసం తనని తాను సిద్ధం చేసుకుంటుంది.