బాక్సాఫీస్.. మార్చి ఆఖరి యుద్ధం!
వీకెండ్ సినిమాల సందడి ఈ ఏడాదిలో ఎక్కువగానే ఉన్న సక్సెస్ లు మాత్రం టాలీవుడ్ కి తక్కువగా వచ్చాయి.
వీకెండ్ సినిమాల సందడి ఈ ఏడాదిలో ఎక్కువగానే ఉన్న సక్సెస్ లు మాత్రం టాలీవుడ్ కి తక్కువగా వచ్చాయి. పెద్ద సినిమాలలో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ అంటే హనుమాన్ మాత్రమే. ఈ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. కొన్ని చిన్న సినిమాలు సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి. బ్లాక్ బస్టర్ అనిపించుకోదగ్గ సినిమాలు అయితే పడలేదు. గత శుక్రవారం వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇక నెలాఖరున రిలీజ్ కాబోయే సినిమల సంగతి చూసుకుంటే మొదట పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి స్వీయ దర్శకత్వంలో చేసిన ది గోట్ లైఫ్ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేవు. అరబిక్ దేశంలో ఒక ఇండియన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ కథాంశంగా ఉండబోతోంది.
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ అవైటింగ్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ కాబోతోంది. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో టిల్లు స్క్వేర్ మీద ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాపై ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ ఉంది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
కలియుగం పట్టణంలో అనే చిన్న సినిమా ఒకటి మార్చి 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాపై చెప్పుకోదగ్గ అంచనాలు లేవు. హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అయితే వీటన్నింటిలో మోస్ట్ ఇంటెస్టింగ్ మూవీ అంటే టిల్లు స్క్వేర్ అని చెప్పాలి. సిద్దు జొన్నలగడ్డ మూవీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం హిట్ అయితే అతని బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అనుపమ బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూడటానికి కుర్రాళ్ళు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
ఇక మార్చి నెలలో రికార్డులు తిరగరాసే సినిమాలు ఏమి రాలేదు. ఇక టిల్లుకి ఈ వారం బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు కూడా ఏమి లేవు. మళ్ళీ వారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రానుంది. ఆ లోపు సమ్మర్ హాలిడేస్ ను టిల్లు ఉపయోగించుకుంటే బెటర్ అని చెప్పవచ్చు.