అవకాశం ఇవ్వకపోతే చస్తా అన్నాడు : విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ లీడ్ రోల్ లో రీతు వర్మ, అభినయ, సెల్వ రాఘవన్, ఎస్.జె సూర్య, సునీల్ ప్రధాన పాత్ర దారులుగా వస్తున్న సినిమా మార్క్ ఆంటోని
కోలీవుడ్ హీరో విశాల్ లీడ్ రోల్ లో రీతు వర్మ, అభినయ, సెల్వ రాఘవన్, ఎస్.జె సూర్య, సునీల్ ప్రధాన పాత్ర దారులుగా వస్తున్న సినిమా మార్క్ ఆంటోని. ఆదిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వినోద్ నిర్మించారు. సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా నితిన్ అటెండ్ అయ్యారు. సినిమా ట్రైలర్ బాగుందని సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని అన్నారు నితిన్.
ఇక విశాల్ మాట్లాడుతూ.. 19 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 19న చెల్లమా తెలుగులో ప్రేమ చదరంగం సినిమాతో తన కెరీర్ మొదలైందని. 19 ఏళ్లుగా ఆ దేవుడు ఈ దేవుళ్ల ఆశీస్సులతో కెరీర్ కొనసాగిస్తున్నానని అన్నారు విశాల్. తను చేసే మంచి పనులు పబ్లిసిటీ కోసం కాదని సెల్ఫ్ శాటిస్ఫ్యాక్షన్ అని అన్నారు విశాల్.
10 నుంచి 120 రూపాయల టికెట్ పెట్టి తన సినిమా టికెట్ కొని ఇన్నేళ్లుగా తనని ఆశీర్వదిస్తూ వస్తున్నారని ఆ డబ్బుతో తన కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకోనని అందుకే సమాజ సేవ చేస్తుంటానని అన్నారు విశాల్. ఈ క్రమంలో తనకు సపోర్ట్ గా ఉన్న స్పాన్సర్స్ కి థ్యాంక్స్ చెప్పారు విశాల్.
ఇక మార్క్ ఆంటోని గురించి చెబుతూ.. ఈ సినిమా జరగడానికి కారణం నిర్మాత వినోద్ అని.. సినిమాకు ఎంత కావాలంటే అంత బడ్జెట్ పెట్టేశారని అన్నారు. తన కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని అన్నారు. సినిమాకు నిర్మాత బేస్ మెట్ లాంటివాడు.. ఇంటికి బేస్ మెట్ ఎంత బాగుంటే ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సినిమాకు నిర్మాత కూడా అలానే అని అన్నారు విశాల్. డైరెక్టర్ ఆదిక్ గురించి చెబుతూ తను 8 ఏళ్లుగా తనకు తెలుసని.. ఓ లవ్ స్టోరీ రాసుకుని 40 మంది నిర్మాతలతో రిజెక్ట్ చేసుకున్నాడని. ఆ తర్వాత వేరే కథతో సినిమా చేస్తే అది హిట్ అయ్యిందని.
ఆ తర్వాత మళ్లీ మరో సినిమా ఫ్లాప్ అయ్యిందని. ఒకసారి తనకు ఫోన్ చేసి అవకాశం ఇవ్వకపోతే చచ్చిపోతా అని అన్నాడని. కానీ తను మాత్రం మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పానని అన్నారు విశాల్. తనతో సినిమా కోసం 7 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న సాదిక్ ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని అన్నారు. ఏదో ఒక సినిమా చేసే వాళ్లం కానీ ఇంతకాలం వెయిట్ చేయడం వల్లే మార్క్ ఆంటోని కుదిరిందని అన్నారు విశాల్. ఆదిక్ తో సినిమా అంటే నిర్మాతలు కూడా భయపెట్టారని అన్నారు. కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో సినిమా చేశానని అన్నారు.
ఇక ఈ సినిమా తనకు ఇద్దరు బ్రదర్స్ ని ఇచ్చారని అన్నారు విశాల్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కోసం సూర్య 22 గంటలు కష్టపడ్డారని.. సినిమాకు ఆయన ఫుల్ ఎఫర్ట్ పెట్టారని అన్నారు. ఇక సునీల్ గారు కూడా సినిమాకు బాగా సపోర్ట్ చేశారని అన్నారు. నితిన్ రానా లానే సూర్య, సునీల్ లాంటి బ్రదర్స్ ని ఈ సినిమా ఇచ్చిందని అన్నారు విశాల్. ఇది కేవలం విశాల్ సినిమా కాదు ఇది టీం వర్క్. సినిమాలో రీతు వర్మ బాగా చేసింది. అభినయ అందరికీ స్పూర్తిగా నిలుస్తుంది. మాట్లాడటం, వినడం లాంటివి తను చాలా అద్భుతంగా నటిస్తుందని అన్నారు. నటించడానికి ఇవేవి అవసరం లేదని ఆమె ప్రూవ్ చేశారని అన్నారు.
ఈ సినిమాను వేణు గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారని. నెల రోజుల ముందు నుంచే థియేటర్లు కూడా సెలెక్ట్ చేశారని అన్నారు. ఇక చివరగా తెలుగు మీడియాకు ధన్యవాదాలు చెప్పారు విశాల్. 30 సినిమాలు తీసిన హీరో అయినా మొదటి సినిమా అయినా తెలుగు మీడియా కెమెరాలు అన్ని చూపిస్తాయని అన్నారు విశాల్.
ఇక ఇదే ఈవెంట్ లో సినిమాలో నటించిన ఎస్.జె సూర్య తనకు డైరెక్టర్ గా పెద్ద హిట్ ఇచ్చింది తెలుగు పరిశ్రమ. పవన్ తో ఖుషి చేశాను.. మహేష్ తో నాని చేశా మళ్లీ మహేష్ కి హిట్ ఇచ్చి బ్యాలెన్స్ చేయాలని అన్నారు సూర్య. సునీల్ మాట్లాడుతూ తన మొదటి తమిళ సినిమా ఇది ఈ అవకాశం ఇచ్చి తనని భరించిన యూనిట్ కు థ్యాంక్స్ అని చెప్పారు.