ప్రభాస్ - మారుతి సినిమా సీక్రెట్‌గా ఉంచడానికి రీజన్ ఇదే
అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతీ మాట్లాడారు. అందుకు గల కారణాన్ని చెప్పేందుకు కాస్త ప్రయత్నించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి మార్క్.. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డీలక్స్ రాజా' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా షూట్ స్టార్ట్ చేసి, కనీసం ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో అసలీ సినిమా ఉందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
మరి ఎందుకు ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా, ఏ విషయం బయటకు రాకుండా ఇంత సైలైంట్‌గా ఉంచుతున్నారో సరైన సమాధానం కూడా ఇవ్వలేదు మూవీటీమ్. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతీ మాట్లాడారు. అందుకు గల కారణాన్ని చెప్పేందుకు కాస్త ప్రయత్నించారు.
ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ను వదిలితే అటు ఫ్యాన్స్ ఇటు అభిమానులు గందరగోళానికి గురౌతారు. పైగా ముందుగానే వాటి అప్డేట్స్ కూడా బయటకు వచ్చేస్తే.. సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి కాస్త హైప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటూ మారుతి తెలివిగా సమాధానం చెప్పారు.
కాగా, ప్రభాస్ - మారుతి సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. థ్రిల్లర్, రొమాంటిక్ అంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. లిమిటెడ్ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్.. డిసెంబర్లో రిలీజ్‌కు రెడీ అయింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రాజెక్ట్ కె కల్కి వచ్చే ఏడాది రానుంది. సందీప్ వంగాతో చేయాల్సిన స్పిరిట్ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇంకా సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో పాటు మరో ఇద్దరు దర్శకులకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.