హైదరాబాద్ లో `యుద్దం` తారక్ హ్యాపీ!
తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఆయాన్ ముఖర్జీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `వార్ -2`ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది. టైగర్ సైతం ముంబై షెడ్యూల్ లో పాల్గొన్నారు. హృతిక్..తారక్ కి సంబంధించి కొన్ని కాంబినేషన్ సన్నవేశాలు చిత్రీకరించారు. గోవా సహా విదేశాల్లోనూ కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేసారు.
తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో ఇంటెన్స్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడే చిత్రీకరిం చనున్నారు. అందుకోసం ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ సెట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది అతి పెద్ద భారీ సెట్ అని అంటున్నారు.
ఈ సెట్ లో ఆగస్టు నుంచి షూటింగ్ మొదలవుతుందిట. తొలుత హృతిక్- ఎన్టీఆర్ మీద కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారుట. అటుపై మిగతా ప్రధాన తారాగణం షూట్లో పాల్గొంటుందని సమాచారం. ప్రస్తుతం `వార్ -2` టీమ్ విశ్రాంతిలో ఉంది. ఎలాంటి షూటింగ్ నిర్వహించలేదు. అయితే మరో వారంలో ముంబైలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ముంబై షెడ్యూల్ అనంతరం టీమ్ హైదరాబాద్ కి రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తారక్ `దేవర` షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ కల్లా ఆ సినిమా షూటింగ్ నుంచి ప్రీ అయ్యే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లోనే షూట్ ఉంటుంది కాబట్టి రెండు సినిమా షూటింగ్ లో ని బ్యాలెన్స్ చేయోచ్చు. అయితే `వార్ -2` లో తారక్ రోల్ ఎలా ఉంటుంది? అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.