మాస్ రాజా బిజినెస్ ట్రాక్.. టాప్ లిస్ట్ ఇదే..
రవితేజకి మాస్ ఇమేజ్ కి తగ్గ కథలు పడితే ఎలాంటి సక్సెస్ అవుతాయో క్రాక్, ధమాకా మూవీస్ ప్రూవ్ చేశాయి.
మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకడిగా తన హవా కొనసాగిస్తున్నాడు. అతనితో సినిమా చేయాలంటే నిర్మాతలు ఒక 30 కోట్లు సిద్ధం చేసుకోవాల్సిందే. రవితేజకి మాస్ ఇమేజ్ కి తగ్గ కథలు పడితే ఎలాంటి సక్సెస్ అవుతాయో క్రాక్, ధమాకా మూవీస్ ప్రూవ్ చేశాయి. ఈ సినిమాల కలెక్షన్స్ వంద కోట్ల వరకు వచ్చాయి. టాలీవుడ్ లో అందరికంటే స్పీడ్ గా రవితేజ సినిమాలు చేస్తున్నాడు.
ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈగల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించింది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ మీద డీసెంట్ బిజినెస్ ఈ మధ్యకాలంలో జరుగుతోంది. ఏవరేజ్ గా చూసుకుంటే 19 నుంచి 22 కోట్ల మధ్య రవితేజ సినిమాలపై డిస్టిబ్యూటర్స్ పెట్టడానికి ముందుకొస్తున్నారు.
ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో థియేట్రికల్ గా హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా అంటే టైగర్ నాగేశ్వరరావు అని చెప్పాలి. ఈ సినిమాపై ఏకంగా 37.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే మూవీ డిజాస్టర్ కావడంతో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించలేకపోయింది. సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఖిలాడీకి జరిగింది. ఈ మూవీపై 22.80 కోట్ల ప్రీరిలీజ్ వ్యాపారం అయ్యింది. ఇది కూడా డిజాస్టర్ జాబితాలోకి చేరిపోయింది.
ఆయన నుంచి చివరిగా వచ్చిన ఎనిమిది సినిమాలలో రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. మిగిలిన సినిమాలలో ఈగల్ ఫలితం తెలియాల్సి ఉంది. ఐదు మూవీస్ మాత్రం డిజాస్టర్ అయ్యాయి. ఈగల్ మూవీ పైన అయితే మంచి బుజ్జింగ్ ఉంది. క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది. థ్రిల్లర్ యాక్షన్ గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. ఈ సినిమా రవితేజకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది వేచి చూడాలి.
ఇక రవితేజ సినిమాల బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.
ఈగల్ - 21Cr~******
టైగర్ నాగేశ్వరరావు - 37.50Cr
రావణాసుర - 22.20Cr
ధమాకా - 18.30Cr
రామారావు ఆన్ డ్యూటీ - 17.20Cr
ఖిలాడీ- 22.80Cr
క్రాక్ - 17.00Cr
డిస్కో రాజా - 19.2Cr