మాస్ రాజా.. ఏంటీ పరిస్థితి?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ రవితేజకు సాలిడ్ హిట్ మాత్రం దొరకడం లేదు.

Update: 2024-02-24 08:57 GMT

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోగా ఎదిగారు మాస్ మహా రాజా రవితేజ. ప్రస్తుతం గట్టి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత రేంజ్ లో ఆ మూవీ హిట్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ రవితేజకు సాలిడ్ హిట్ మాత్రం దొరకడం లేదు.

అయితే కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో హీరో రవితేజ.. కొన్నేళ్ల క్రితం ప్రొడక్షన్ బ్యానర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ హీరో నిర్మాతగా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించిన గుట్ట కుస్తీ (తెలుగులో మట్టి కుస్తీ) మూవీకి తొలిసారి సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఆ తర్వాత ఛాంగురే బంగారు రాజా మూవీని నిర్మించారు రవితేజ. ఇందులో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నంతోపాటు ఎక్కువ మంది కమెడియన్లే నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాను కూడా ఎంతో ఇష్టపడి ప్రొడ్యూస్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌ లో ఆకట్టుకోలేదు.

తాజాగా టాలీవుడ్ కమెడియన్ వైవా హర్షను హీరోగా పరిచయం చేస్తూ సుందరం మాస్టర్ మూవీని నిర్మించారు రవితేజ. ఫిబ్రవరి 23వ తేదీన విడుదలైంది ఈ చిత్రం. సినీ ప్రియుల్లో అంతగా బజ్ క్రియేట్ చేయని ఈ మూవీ మార్నింగ్ షోలకు ఆడియన్సే లేరు. ఇక ఈ సినిమా చూసిన నెటిజన్లు.. స్టోరీ కన్నా సందేశాలకే మేకర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటున్నారు. సెకండ్ హాఫ్ అస్సలు బాలేదని చెబుతున్నారు. ఈ మూవీతో నిర్మాతగా రవితేజకు మరో షాక్ తగిలినట్లే.

అయితే రవితేజకు అటు సినిమాల పరంగా, ఇటు ప్రొడక్షన్ పరంగా కలిసి రావట్లేదని నెటిజన్లు అంటున్నారు. డబ్బులు పరంగా ఎలాంటి లాస్ లేకపోయినా.. బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతుందని చెబుతున్నారు. దాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలని సూచిస్తున్నారు. తీసినవి మంచి సినిమాలు అయినా.. మెప్పించడంలేదని అంటున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ మూవీ అయినా మాస్ మహారాజాకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News