వెయిటర్‌గా మొదలై 200 హిట్ సినిమాల్లో నటించిన బాక్సర్!
స్టంట్ పెర్‌ఫార్మర్‌గా ఎదిగిన అతడు 70లు 80లలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విలన్‌లలో ఒకరు.
అతడు బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడి తండ్రి. ఆరంభం హోటల్లో వెయిటర్ గా పని చేసాడు. ఆ తర్వాత అనూహ్యంగా బాడీ బిల్డింగ్ లో చేరాడు. బాక్సర్ గా ఎదిగాడు. అక్కడ అజేయంగా రాణించి, అటుపై నటుడయ్యాడు. విలన్ గా నటించిన అతడు 200 హిట్ చిత్రాలు అందించాడు. 80లలో గొప్ప స్టార్ విలన్ గా ఏలాడు. ఇప్పుడు అతడి కుమారుడు బాలీవుడ్ లో అజేయమైన స్టార్ డైరెక్టర్. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో సంచలనాలు సృష్టిస్తున్న ప్రముఖ వ్యక్తి. అతడే ప్రఖ్యాత దర్శకుడు రోహిత్ శెట్టి తండ్రి ఎంబి శెట్టి.
ఒక తరం సినీ ప్రేక్షకులకు MB శెట్టి మహోన్నతమైన వ్యక్తిత్వం ఎదురేలేని విలనీ భయం కలిగించింది. స్టంట్ పెర్‌ఫార్మర్‌గా ఎదిగిన అతడు 70లు 80లలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విలన్‌లలో ఒకరు. అయితే శెట్టి ప్రయాణం సులువుగా ప్రారంభం కాలేదు. నిరాడంబరమైన ప్రారంభం నుండి వచ్చిన అతడు సినిమాలలో చాలా ఎత్తుకు ఎదిగి కనుమరుగయ్యాడు. కానీ అతడు సినీరంగంలో ఎదగక ముందే ఇతర పరిశ్రమలలో చాలా శ్రమించాడు.
1931లో మంగళూరులో జన్మించిన శెట్టి దేశ విభజన తర్వాత ముంబైకి (అప్పటి బొంబాయి) వెళ్లారు. అతడు యుక్తవయసులో కాటన్ గ్రీన్‌లో వెయిటర్‌గా పనిచేసాడు. దాని తర్వాత అతడు బాక్సింగ్ అండ్ బాడీబిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. సినీరంగంలో అతడి మొదటి ప్రయత్నం 1956 చిత్రం 'హీర్'లో పోరాట శిక్షకుడిగా ఛాన్స్ వచ్చింది. మరుసటి సంవత్సరం అతడు 'తుమ్సా నహీ దేఖా'లో మొదటిసారిగా తెరపై కనిపించాడు. దీంతో అతని విలన్ పాత్రల ప్రయాణం మొదలైంది.
'తుమ్సా నహిన్ దేఖా'తో ప్రారంభించి శెట్టి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఫిల్స్‌లో కనిపించడం ప్రారంభించాడు. తన కెరీర్‌లో శెట్టి హిందీ, కన్నడతో పాటు ఇతర భాషలలో 700 పైగా చిత్రాలలో కనిపించారు. వీటిలో చాలా మంది హీరోల కంటే ఎక్కువ హిట్‌లు ఉన్నాయి. దాదాపు 200 హిట్లు అతడి కెరీర్ లో ఉన్నాయి. అతడి పెద్ద విజయాలలో యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్, కాళీచరణ్, త్రిశూల్, డాన్, కాలా పానీ మొదలైనవి ఉన్నాయి. అతడు తన 50వ దశకంలోకి ప్రవేశించాక (80లలో) సినిమాలలో అంతగా నటించలేదు. MB శెట్టి 1982లో 51 సంవత్సరాల వయసులో మరణించారు.
MB శెట్టి కొడుకు స్టార్ డైరెక్టర్
MB శెట్టి వారసత్వాన్ని అతడి కుమారుడు - దర్శకనిర్మాత రోహిత్ శెట్టి ముందుకు తీసుకెళ్లారు. తన తండ్రిలాగే రోహిత్ క్రూ మెంబర్‌గా, స్టంట్ టీమ్‌లలో పని చేసి ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత జమీన్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. నేడు అతడు బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా ఎదిగాడు. అతడు తెరకెక్కించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల మార్కును దాటుతున్నాయి.