విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'.. పర్ఫెక్ట్ డేట్ పట్టేశాడు

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మెకానిక్ రాకీ' షూటింగ్ దశలోనే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

Update: 2024-10-14 10:47 GMT

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మెకానిక్ రాకీ' షూటింగ్ దశలోనే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. విశ్వక్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో సరికొత్త కథాంశం ఉంటుందని ఆడియెన్స్ లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ సక్సెస్ రేటుతో సినిమాలు చేస్తున్న అతికొద్దిమంది యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు.


ఇక ఈసారి మరో సరికొత్త రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే మెకానిక్ రాకీ. ఈ సినిమాను మొదటగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు. మంచి టైమ్ లోనే విడుదల చేయాలని ఇన్ని రోజులు ఎదురుచూశారు.,

ఇక ఫైనల్ గా మెకానిక్ రాఖీ సినిమాను నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఆ టైమ్ లో ఎలాంటి పోటీ లేకుండా 'మెకానిక్ రాకీ' సొలోగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి సాలీడ్ వసూళ్ళను అందుకునే అవకాశం అయితే ఉంది. వాయిదా కారణంగా లభించిన అదనపు సమయంతో సినిమా ప్రమోషన్‌లను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్ టీజర్, కొన్ని పాటలు ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొల్పాయి. ముఖ్యంగా, సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూవ్స్ అందుకుంది. ఇక విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో నెవర్ సీన్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. తాజా విడుదల తేదీ పోస్టర్‌లో విశ్వక్ సేన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాడు.

ఈ పోస్టర్ విశ్వక్ పాత్రపై ఆసక్తిని రేకెత్తించింది. ఇక కథానాయికలు మీనాక్షి చౌదరి సాంప్రదాయ చీరలో అందంగా కనిపిస్తుండగా, మరో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ స్టైలిష్ అమ్మాయిగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ట్రైలర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతుందని అంచనాలు ఉన్నాయి. మెకానిక్ రాకీ’ సినిమాను SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News