మీనాక్షి చౌదరి.. సన్నని నడుముతోనే మాయ చేస్తోందిగా..
నాజూకైన చిరునవ్వు, చీరకట్టులో ఒదిగిపోయిన ఆమె నడుము అందంతో ఫాలోవర్స్ మనసులను దోచేస్తోంది.
మీనాక్షి చౌదరి.. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతున్న హీరోయిన్. అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో సరికొత్త స్టిల్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక తన తాజా గ్లామర్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఎర్రటి చీరలో తన అందాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న ఆమె, టాలీవుడ్‌లో నటిగా మాత్రమే కాదు, ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఎదిగారు. నాజూకైన చిరునవ్వు, చీరకట్టులో ఒదిగిపోయిన ఆమె నడుము అందంతో ఫాలోవర్స్ మనసులను దోచేస్తోంది.
ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. హర్యానాలో జన్మించిన మీనాక్షి చౌదరి తన కెరీర్‌ను వెబ్ సిరీస్ ‘అవుట్ ఆఫ్ లవ్’తో ప్రారంభించారు. బాలీవుడ్‌లో ‘అప్‌స్టార్ట్స్’తో అరంగేట్రం చేసిన ఆమె, తరువాత తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తన తొలి చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’లో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తరువాత రవితేజ సరసన ‘ఖిలాడీ’లో తన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు.
ఆ తర్వాత అడివి శేష్‌తో చేసిన ‘హిట్ 2’ సినిమాతో మీనాక్షి తొలి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం ఆమెకు టాలీవుడ్‌లో ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చింది. గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబుతో కలిసి నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, మీనాక్షి గ్లామర్ పరంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’లో దుల్కర్ సల్మాన్ సరసన నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.
సినిమా విడుదలైనప్పటి నుంచి మీనాక్షి పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మీనాక్షి మరోసారి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నెక్స్ట్ వెంకటేష్ తో కలిసి నటించిన ‘సంక్రాంతి వస్తున్నాం' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పాన్ ఇండియా మూవీ ‘మట్కా’లో వరుణ్ తేజ్ సరసన కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అంతగా క్లిక్ కాలేదు. ఇక లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఆమె ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌పై ఎంత దృష్టి పెట్టిందో అర్థమవుతుంది.