మీనాక్షితో మామూలుగా ఉండదంతే..!
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ఆ సినిమాతో ఆడియన్స్ ని అలరించగా హిట్ 2 తో పాటు వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంది
తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో కొత్త భామ మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ఆ సినిమాతో ఆడియన్స్ ని అలరించగా హిట్ 2 తో పాటు వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంది. ఓ పక్క యువ హీరోలతో నటిస్తూ స్టార్ సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుంటుంది అమ్మడు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం, కోలీవుడ్ లో దళపతి విజయ్ తో కలిసి నటించిన మీనాక్షి లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా సక్సెస్ తో మీనాక్షి పేరు మరోసారి హైలెట్ గా నిలిచింది. మీనాక్షి కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఎక్స్ లవర్ గా చేసిన మీనాక్షి చౌదరి ఒక డెంటల్ డాక్టర్ అని ఎవరికీ తెలియదు. ఆమె ప్రొఫెషనల్ డెంటల్ డాక్టర్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అంతేకాదు 2018 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో కూడా హర్యానా నుంచి వచ్చిన అమ్మడు మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. ఇక అమ్మడు ప్రతి ఒక్కరు జీవితంలో హార్డ్ వర్క్, డిసిప్లేన్ ఈ రెండు పాటిస్తే కచ్చితంగా సక్సెస్ వస్తుందని అంటుంది మీనాక్షి. అంతేకాదు ప్రతి విషయంలో మన పద్ధతి అవతల వారికి ఎలా ఉందో అన్నది చూసుకోవాలని అంటుంది. ఫీల్డ్ ఏదైనా సరే ఇవి పాటిస్తే సక్సెస్ అందుకుంటామని అన్నది.
ఇక చిన్నప్పటి నుంచి డాక్టర్, మిస్ ఇండియా కోరికలు నెరవేరాయని.. ఐతే సివిల్ సర్వెంట్ అవ్వాలని ఉండేదని కూడా చెప్పుకొచ్చింది అమ్మడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న అమ్మడు కెరీర్ లో ఇప్పుడు మరింత జాగ్రత్త పడాలని చూస్తుంది. మీనాక్షికి రాబోతున్న సినిమాలతో కూడా ఇదే లక్ కొనసాగితే తప్పకుండా అమ్మడు కూడా టాప్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీనాక్షికి వచ్చిన ఈ లక్కీ ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం నిజంగానే తెలుగులో ఒక రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.